సోమవారమే ప్రాణాంతకమైన గుండెపోట్లు సంభవిస్తున్నాయి.. ఎందుకంటే??
ప్రాణాంతకమైన గుండెపోట్లు సోమవారం ఎక్కువగా సంభవిస్తాయని తెలిపింది తాజా అధ్యయనం.
దిశ, ఫీచర్స్: ప్రాణాంతకమైన గుండెపోట్లు సోమవారం ఎక్కువగా సంభవిస్తాయని తెలిపింది తాజా అధ్యయనం. UKలోని మాంచెస్టర్‌లో జరిగిన బ్రిటిష్ కార్డియోవాస్కులర్ సొసైటీ (BCS) కాన్ఫరెన్స్‌లో సమర్పించబడిన అధ్యయనం.. మండే హార్ట్ఎటాక్ సంభవించే అవకాశం ఊహించిన దాని కంటే 13% ఎక్కువగా ఉందని కనుగొంది.
బెల్ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్, ఐర్లాండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ వైద్యులు.. 2013-2018 మధ్య ఆసుపత్రిలో చేరిన ఐర్లాండ్ ద్వీపంలోని 10,528 మంది రోగుల డేటాను విశ్లేషించారు. ప్రధాన కరోనరీ ఆర్టరీ పూర్తిగా నిరోధించబడినప్పుడు STEMI(సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్-తీవ్రమైన గుండెపోటు) సంభవిస్తుందని గుర్తించారు.
పని వారం ప్రారంభంలో STEMI గుండెపోటుల రేట్లు పెరుగుతాయని కనుగొన్న పరిశోధకులు.. ఈ ‘బ్లూ మండే’ ఫినామినన్ ఎందుకు సంభవిస్తుందో ఇప్పటి వరకు కచ్చితంగా గుర్తించలేకపోయారు. అయితే మునుపటి అధ్యయనాలు సిర్కాడియన్ రిథమ్‌తో అనుబంధాన్ని హైలైట్ చేయగా.. దీంతోపాటు మల్టీఫ్యాక్టోరియల్(జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిసీజెస్) కూడా కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు శాస్త్రవేత్తలు. అయితే ఈ తీవ్రమైన గుండెపోటు నుంచి బయటపడేందుకు అత్యవసర యాంజియోప్లాస్టీ అవసరమని.. నిరోధించబడిన కరోనరీ ఆర్టరీని తిరిగి తెరవడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని చెప్పారు.
Also Read: ఇస్నోమియా టు స్లీప్ పెరాలిసిస్.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న 6 డిజార్డర్స్