జ్ఞాపకశక్తిని పెంచుతున్న సువాసనలు.. అధ్యయనంలో వెల్లడి
సువాసనలు మనిషికి ఆనందాన్ని కలిగిస్తాయని మనకు తెలుసు.. కానీ వాటికి అవి జ్ఞాపకశక్తిని పెంచుతాయని, చిత్త వైకల్యాన్ని నివారిస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
దిశ, ఫీచర్స్ : సువాసనలు మనిషికి ఆనందాన్ని కలిగిస్తాయని మనకు తెలుసు.. కానీ వాటికి అవి జ్ఞాపకశక్తిని పెంచుతాయని, చిత్త వైకల్యాన్ని నివారిస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కొన్ని రకాల పరిమళ భరితాలకు గురికావడంవల్ల డెమెన్షియా బాధితులు కోలుకునే అవకాశం ఉందని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన న్యూరో సైంటిస్టులు చెప్తున్నారు. గత అధ్యయనాలు కూడా డెమెన్షియా బాధితులు రోజుకు రెండు సార్లు 40 సువాసలనకు గురైనప్పుడు వారిలో జ్ఞాపకశక్తి, భాషా నైపుణ్యాలు మెరుగుపడినట్లు వెల్లడించాయి.
తాజాగా మరో అడుగు ముందుకు వేసిన పరిశోధకులు జ్ఞానపరమైన బలహీనత కలిగిన వ్యక్తులను సెన్స్ ఆఫ్ స్మెల్ ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ట్రయల్స్‌లో భాగంగా 60 నుంచి 85 సంవత్సరాల మధ్య వయస్సు గల 43 మంది ప్రతిరోజూ 80 సువాసనలను స్నిఫ్ చేయడాన్ని అబ్జర్వ్ చేశారు. ఈ సువాసనల్లో గులాబీ, నారింజ, యూకలిప్టస్, నిమ్మకాయ, పిప్పరమెంటు, రోజ్మేరీ అండ్ లావెండర్ వంటివి ఇంకెన్నో ఉన్నాయి. అయితే నాడీశాస్త్రపరంగా వాటి వాసన డెమెన్షియా బాధితుల్లో, సాధారణ వ్యక్తుల్లో కూడా జ్ఞాపకాలను ప్రేరేపించిందని, మతిమరుపును నివారించిందని పరిశోధకులు గుర్తించారు. ఇక సీనియర్ సిటిజన్లు ప్రతి రాత్రి రెండు గంటల పాటు తమ బెడ్‌రూమ్‌లలో సువాసన డిఫ్యూజర్స్‌ను ఉపయోగించిన తర్వాత గతంకంటే వారి జ్ఞాపకశక్తి పనితీరులో 226 శాతం పెరుగుదల కనిపించిందని న్యూరో సైంటిస్టులు పేర్కొన్నారు.