బరువు తగ్గినా మళ్లీ ఎందుకు పెరుగుతారు?.. ఏం చేస్తే బెటర్
ఈ మధ్య చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. రకరకాల వ్యాయామాలు, ఆహార నియమాలతో కొందరు వెయిట్ లాస్ సాధించినప్పటికీ, కొంతకాలానికి అదే పరిస్థితి రిపీట్ అవుతోంది.
దిశ, ఫీచర్స్: ఈ మధ్య చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. రకరకాల వ్యాయామాలు, ఆహార నియమాలతో కొందరు వెయిట్ లాస్ సాధించినప్పటికీ, కొంతకాలానికి అదే పరిస్థితి రిపీట్ అవుతోంది. రోజుకు 700 నుంచి 1200 కేలరీల మధ్య ఉండేలా తక్కువ కేలరీలు తీసుకునే వారు కూడా కొంతకాలానికి తిరిగి బరువు పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అలాగే బిహేవియరల్ వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఫాలో అయ్యేవారు కూడా బరువు తగ్గిన ఏడాదికే మళ్లీ 30 శాతం నుంచి 35 శాతం వరుకు పెరుగుతున్నారు. వరల్డ్ వైడ్‌గా వెగోవి వంటి వెయిట్ లాస్ మెడికేషన్స్ తీసుకున్నవారిలోనూ మూడింట రెండు వంతుల మందిలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఒక్కసారి తగ్గాక మళ్లీ పెరగకుండా ఏం చేయాలి?
కారణాలేమైనా తిరిగి బరువు పెరగవద్దంటే కొన్ని టిప్స్ పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా వెయిట్ తగ్గడానికి అనుసరించిన లైఫ్ స్టైల్ లేదా వ్యాయామాలు ఆ తర్వాత కూడా కొనసాగిస్తూనే ఉండాలి. కొందరు మానసిక ఆందోళనవల్ల ఆహార నియమాలను ఉల్లంఘిస్తుంటారు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. కొంచెం బరువు పెరిగినా గిల్టీగా ఫీలయ్యే అలవాటు ఉన్నవారు దానికి స్వస్తి పలకాలి. ఏ విషయంలోనూ అతి అంచనాలు, అతి ఆలోచనలు తగదు.
ఇక సెలవులు, శుభకార్యాలు వంటి సందర్భాల్లో వెయిట్ మేనేజ్ మెంట్ నియమాలు చాలా మంది మరిచిపోతుంటారు. ఈ అవకాశం ఉన్నవారు ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలాగే డిన్నర్ తర్వాత తప్పకుండా వాకింగ్ చేయాలి. వీలైతే మెట్లు ఎక్కడం దిగడం చేయడం మంచిది. అన్నింటికంటే ముఖ్యమైంది శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. అత్యధికమందిలో బరువు తగ్గాక కూడా మళ్లీ పెరగడానికి శారీరక శ్రమ తక్కువగా ఉండటమే కారణం అవుతోంది. అందుకే తగ్గిన బరువును అలానే మెయింటెన్ చేయాలంటే డైలీ 250 నిమిషాల మేరకు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.