మీకంటూ ఓ లైఫ్ పర్పస్ ఉండాలంటున్న నిపుణులు.. ఎందుకంటే..

Update: 2024-01-20 12:57 GMT

దిశ, ఫీచర్స్ : మనుషులుగా జీవించడమే కాదు.. చెప్పుకోవడానికి మీకంటూ ఒక లైఫ్ పర్పస్ అండ్ లైఫ్ గ్రోత్ కూడా కలిగి ఉండాలంటారు నిపుణులు. లైఫ్ అనేది జర్నీ లాంటిది. ఒక్కో స్టేజీలో ఒక్కో విధంగా ఉంటుంది. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, సోషల్ ఇంపాక్ట్‌ను బట్టి, పర్సనల్ కంఫర్ట్‌ను బట్టి వ్యక్తుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. బయటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలనేది మాత్రం వ్యక్తిగత అంశంగానే ఉంటుంది. అందుకే సంతోషకరమైన జీవితాన్ని పొందడానికి, అందరిలో మీరు ప్రత్యేకంగా నిలువడానికి మీకంటూ ప్రయోజనకరమైన ఉద్దేశం కలిగి ఉండటం మంచిదని నిపుణులు చెప్తున్నారు. అటువంటి గుడ్ అండ్ హ్యాపీనెస్ లైఫ్ పర్పస్ థాట్స్ గురించి చర్చిద్దాం.

ప్రయోజనం లేని జీవితం శూన్యం అంటుంటారు ఫిలాసఫర్లు ‘నికోమాచియన్ ఎథిక్స్‌’ అనే పుస్తకంలో అరిస్టాటిల్ కూడా సంతృప్తికరమైన జీవితం కావాలంటే ఎండ్స్ అండ్ ఎస్సెన్సెస్(Ends and essences) ఉండాలని చెప్తాడు. అందుకే వాటిపై ఫోకస్ చేయాలని సూచిస్తాడు. దీనివల్ల మీ జీవితానికి కారణం, గుడ్ లైఫ్ వాల్యూస్ ఏంటో తెలుస్తాయంటాడు. అతనే కాదు అనేకమంది సామాజిక వేత్తలు మనుషులు ఎలా జీవించాలనే విషయాలపై పలు థియరీలను రూపొందించారు. కొందరు మనిషిగా ఉండే ఫండమెంటల్ పర్పస్‌లను ఎనలైజ్ చేశారు. హ్యాపీనెస్ లైఫ్ కోసం మానవులు హేతుబద్దమైన ఎంపికలను కలిగి ఉండాలని, అప్పుడే లైఫ్ పర్పస్ నెరవేరుతుందని మానసిక నిపుణులు కూడా పేర్కొంటున్నారు.

ఉద్దేశం, లక్ష్యం, ప్రయోజనం..

మీకంటూ ఒక లైఫ్ పర్పస్ లేకపోతే హ్యాపీగా ఉండలేరు. ఒక విధంగా గుడ్ లైఫ్ కోసం వేసే అడుగులో ఆలోచించాల్సిన గొప్ప విషయమే పర్పస్. ఒక ఉద్దేశమో, లక్ష్యమో ఉన్నప్పుడు. ఇక మీరు ఏం చేయాలో అదే గైడ్ చేస్తుంది. ఉదాహరణకు ఒక మొబైల్ ఫోన్ మీకు ఎందుకు అవసరం? ఒక వాహనం ఎందుకు అవసరం? అనే విషయాల్లో మీకంటూ ఒక అవగాహన, ఉద్దేశం, పర్పస్ ఉంటాయి. అలాగే పర్పస్ లేదా ప్రయోజనం అనేది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రయోజనం లేకపోతే అర్థం ఉండదు. ఎవరికీ అవసరం ఉండదు. జీవితం కూడా అంతే. పర్పస్‌ అంటూ ఉంటే.. ఆచరణలో పెడతారు. విజయం సాధిస్తారు.

ఓన్ థాట్స్.. లైఫ్ గ్రోత్..

లైఫ్ పర్పస్ నెరవేరాలంటే జీవితంలో ఒకచోట ఆగిపోవద్దని నిపుణులు చెప్తున్నారు. మీరు చేస్తున్న పనిలో, వృత్తిలో, రంగంలో గ్రోత్ ఉండాలని అప్పుడే మీ లైఫ్ పర్పస్ నెరవేరుతుందని చెప్తున్నారు. జీవితంలో ప్రతి ఒక్కరి పనితీరులో గ్రోత్, పోషణ వంటి అంశాలు ప్రామాణికంగా ఉంటాయి. రీ ప్రొడక్షన్ కంటే ఎక్కువగా వీటిపైనే ఫోకస్ ఉండాలని అరిస్టాటిల్ చెప్తాడు. మొక్కలు కూడా ఈ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మానవేతర జంతువులు కూడా వీటిని చేయగలవు. కాబట్టి మీ పనితీరు కూడా మీ అవగాహనకు మించిన అంచనాలతో కొనసాగాలనేది నిపుణులు చెప్తున్న మాట. అంతేకాదు జీవితంలో మంచి, చెడులను నిర్ణయించగల, ప్రభావితం చేయగల అంశాలు ఉంటాయి. అందుకే ఆలోచనలకు పదును పెట్టాలి. ఆచరణలో రాటు దేలాలి. ముఖ్యంగా మీ లైఫ్‌కు ఒక పర్పస్ అంటూ ఉంటే హేతు బద్ధంగా ఆలోచించడం నేర్చుకుంటారు. అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు, లైఫ్ జడ్జిమెంట్స్ కరెక్టుగా ఉంటాయి. చదువులో, కెరీర్‌లో, వర్క్‌లో ఎక్కడైనా ఇది వర్తిస్తుది. వీటన్నింటితోపాటు సందర్భాన్ని బట్టి నడుచుకునే నైపుణ్యం, ఓన్ థాట్స్ కలిగి ఉండటం లైఫ్ పర్పస్‌ను నెరవేరుస్తాయని నిపుణులు చెప్తున్నారు.


Similar News