ఈ సీక్రెట్స్ పంచుకుంటే జీవితం నాశనం అయినట్లే.. తర్వాత మీ ఇష్టం
మనుషులందరూ సాధారణంగా పరస్పర కమ్యూనికేషన్ కలిగి ఉంటారు. అనేక విషయాల్లో సోషల్ ఇంటరాక్షన్స్‌పై ఆధారపడతారు. ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పరిచయస్తులు.. ఇలా ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను, అభిప్రాయాలను ప్రత్యక్షంగానూ, సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంటూ ఉంటారు.
దిశ, ఫీచర్స్ : మనుషులందరూ సాధారణంగా పరస్పర కమ్యూనికేషన్ కలిగి ఉంటారు. అనేక విషయాల్లో సోషల్ ఇంటరాక్షన్స్‌పై ఆధారపడతారు. ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పరిచయస్తులు.. ఇలా ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను, అభిప్రాయాలను ప్రత్యక్షంగానూ, సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తమ డైలీ రొటీన్స్‌ను పంచుకునేవారు లెక్కపెట్టలేనంత మందే ఉంటున్నారు. అయితే దీనివల్ల తర్వాత సమస్యలు ఎదుర్కొనే చాన్స్ ఉందంటున్నారు నిపుణులు. అందుకే కొన్ని విషయాలను కనీసం బెస్ట్ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.
ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్
మీకు నమ్మకస్తులే కావచ్చు. బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు. పరస్పర అవగాహనతో, సామాజిక స్పృహతో మెలుగుతుండవచ్చు. అయినా మీకంటూ కొన్ని వ్యక్తిగత సరిహద్దులు ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాలను ఎవరితోనూ ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు అంటున్నారు నిపుణులు. మీ ఆదాయం, పొదుపు, అప్పులు, ఆర్థిక సమస్యలు, పెట్టుబడి, ఖర్చులు, బ్యాంక్ బ్యాలెన్స్ వంటి అంశాలను షేర్ చేసుకోవడం లేదా వాటి గురించి మీ స్నేహితులను తరచూ అడగడం వంటివి చేయకండి. దీని కారణంగా మీ మధ్య స్నేహ బంధం చెదిరిపోవచ్చు. పైగా ఈ విషయాలు ఒకరి నుంచి మరొకరికి పాకడం ద్వారా మీ ఫైనాన్షియల్ భద్రతకు ముప్పు వాటిల్లవచ్చు.
మారిటల్ లైఫ్ కాంట్రవర్సీస్
భార్య భర్తల మధ్య గొడవలు, వివాదాలు, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలోనో, ఇతర స్నేహితులతోనో షేర్ చేసుకోవడం మంచిది కాదు. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒడిదుడుకులు, సంతోషాలు, సరదాలు, అన్నీ ఉంటాయి. కొన్నిసార్లు వాటిని స్నేహితుల వద్ద పంచుకోవడం ద్వారా రిలాక్స్ అనిపిస్తుండవచ్చు. కానీ మీ సంబంధం గురించిన ప్రతి వ్యక్తిగత విషయాన్ని బహిర్గతం చేయడం ప్రమాదకరం. దీనివల్ల ఇంటి గుట్టు బయట పెట్టినట్లు అవుతుంది. క్రమంగా మీ వ్యక్తిగత విలువలకు భంగం కలుగవచ్చు. సంబంధాల్లో అన్యోన్యతను దెబ్బతీయవచ్చు. అందుకే మీ వైవాహిక జీవితం లేదా సహజీవనంలోని పర్సనల్ విషయాలను పంచుకోకండి.
ఫ్యామిలీ ఇష్యూస్
కుటుంబం అన్నాక సమస్యలు, సవాళ్లు, సంతోషాలు కామన్. కొన్ని సార్లు ఇబ్బందులు తలెత్తినా, చిన్న చిన్న గొడవలు జరిగినా తర్వాత సర్దుకుంటాయి. ఎక్కడైనా కుటుంబం చెదిరిపోయిందంటే ఆ కుటుంబంలోని ప్రతి విషయాన్ని బహిర్గతం చేయడం కూడా ప్రధాన కారణంగా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. అందుకే కుటుంబ కలహాలు, కేవలం మీరు మాత్రమే పరిష్కరించుకోగలిగే విషయాలను సోషల్ మీడియాలో, బయటి వ్యక్తులతో, స్నేహితులతో పంచుకోవద్దు. రహస్యాలను ఇతరులతో షేర్ చేసుకోవడం ద్వారా తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
వర్క్‌ప్లేస్ విషయాలు
మీరు పనిచేసే ఆఫీసులోచిన్న చిన్న విషయాలు కొన్నిసార్లు సమస్యగా అనిపించవచ్చు. వాటి పరిష్కారానికి మార్గం ఆలోచించాలి. అంతే కానీ ప్రతిదీ అందరితో చెప్పుకుంటూ, అంతర్గత విషయాలను బయట పెట్టడం మంచిది కాదు. దీనివల్ల మీకు, మీ కార్యాలయానికి నష్టం జరుగుతుందని నిపుణులు అటున్నారు. ఏమీ కాదులే.. అనుకుని మీ బెస్ట్ ఫ్రెండ్ వద్దో, తెలిసిన వ్యక్తివద్దో మాట్లాడకూడని విషయాలు చర్చిస్తే, వాటిని థర్డ్ పర్సన్ పసిగట్టవచ్చు. తర్వాత గాసిప్‌లకు దారితీయవచ్చు. ఇది మీ ప్రొఫెషనల్ లైఫ్‌ను దెబ్బతీసే చాన్స్ ఉంటుంది. అందుకే వర్క్‌ప్లేస్‌లో డిగ్నిటీ పాటించాలని నిపుణులు చెప్తుంటారు.
వ్యక్తిగత అంశాలు
మీకు మానసికంగా, శారీరకంగా ఏవైనా సమస్యలు ఉండవచ్చు. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండవచ్చు. అయినా వాటిని ఫైనల్‌గా పరిష్కరించుకోవాల్సింది మాత్రం మీరే. ప్రతి విషయాన్ని ఇతరులతో షేర్ చేసుకోవద్దు. ముఖ్యంగా మీ శృంగార జీవితం, ఇతరులతో మీ వ్యక్తిగత సంబంధాల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహితుల వద్ద, పరిచయస్తుల వద్ద ప్రస్తావించ కూడదు. అలాగే మీ బలహీనతలను, అభద్రతాభావాన్ని కూడా బయటపెట్ట కూడదు. దీనివల్ల తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మీకు సంతోషాన్ని కలిగించేవి అయిన, వ్యక్తిగతం కాని కొన్ని విషయాలను పంచుకోవడంలో తప్పులేదు. కానీ ఇతరులు మీ వ్యక్తిగత ఆలోచనలు, జీవితానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకునేంత చొరవ ఎవరికీ ఇవ్వకూడదు. కాబట్టి మీ ప్రాణ స్నేహితులైనా సరే. విషయాలు షేర్ చేసుకునే సందర్భంలో బౌండరీస్ సెట్ చేసుకోవడం మంచిది.
Read More..