మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలా?.. ‘ఫీల్ గుడ్ స్లీప్’ హెల్ప్ అవుతుంది!
రకరకాల మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి సమస్యలు ఆందోళనకు, అనారోగ్యాలకు కారణం అవుతుంటాయి.
దిశ, ఫీచర్స్ : రకరకాల మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి సమస్యలు ఆందోళనకు, అనారోగ్యాలకు కారణం అవుతుంటాయి. అయితే ఇలాంటివారు తమకు ఇష్టమైన వ్యక్తుల సమక్షంలో, అలాగే ఒక వ్యక్తి తన భాగస్వామి పక్కన, పిల్లలు తమ పేరెంట్స్ పక్కన పడుకున్నప్పుడు కలిగే అనుభూతివల్ల ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీనినే ‘ఫీల్ గుడ్ స్లీప్’ అని నిపుణులు పేర్కొంటున్నారు. హెల్తీ అండ్ లవ్లీ రిలేషన్‌షిప్స్ నాణ్యమైన నిద్రకు దోహదం చేయడంవల్ల ఇలా జరుగుతుందట. ఎందుకంటే వ్యక్తులు తమకు నమ్మకమైన కుటుంబ సభ్యులతో కలిసి పడుకున్నప్పుడు త్వరగా నిద్రపోతారు. ఆ సందర్భంలో నిద్రపోయే విధానం మిగతా సమయాల్లో కంటే క్వాలిటీగా ఉంటుంది. అంతేకాదు తమకు అత్యంత ఇష్టమైనవారి సమక్షంలో నిద్రపోయే ముందు వ్యక్తులు బెటర్ అండ్ సెక్యూర్‌గా ఫీలవ్వడం కారణంగా ‘ఫీల్ గుడ్’ అని పిలువబడే ఆక్సిటోసిన్, సెరోటోనిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వీటిని లవ్ హార్మోన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి క్వాలిటీ స్లీప్‌ను ప్రేరేపించడం కారణంగా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ కావడంతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతారని నిపుణులు అంటున్నారు.