అందాన్ని పెంచే అద్భుత ఫలం ఫైనాపిల్.. ఎందుకంటే..
మనం తినే కొన్నిరకాల పండ్లు ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు.
దిశ, ఫీచర్స్ : మనం తినే కొన్నిరకాల పండ్లు ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. అలాంటి వాటిలో ఫైనాపిల్ ఒకటి. పుల్లగా, తియ్యగా ఉండే ఈ ఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, సోడియం నిల్వలు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని దూరం చేస్తాయి. ఇక ‘సి’ విటమిన్ కూడా కలిగి ఉండటంవల్ల డయాబెటిస్, కార్డియో వాస్క్యులర్, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది. ఫైనాపిల్‌లోని బ్రోమెలెయిన్ ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరం, ముఖంలో నిగారింపును పెంచుతుంది. దీంతోపాటు ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటంవల్ల శీతాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, బ్యాక్టీరియాను అవసరమైన ఇమ్యూనిటీ పవర్‌ను ఇస్తుంది. తరచుగా ఫైనాపిల్ తినడంవల్ల ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా రోగనిరోధక శక్తితో పాటు అందాన్ని ఇనుమడింపజేస్తాయని డైటీషియన్లు అంటున్నారు. అందం, ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఆలోచించేవారు ఫైనాపిల్ కూడా తప్పక తీసుకోవాల్సిన ఫలం.