చలికాలంలో ఐస్‌ బాత్.. లాభమా?.. నష్టమా?

Update: 2024-01-14 08:08 GMT

దిశ, ఫీచర్స్ : వింటర్ సీజన్‌లో చన్నీళ్లతో స్నానం చేయడం, ఐస్ క్రీములు తినడం, మంచులో తడవడం ఆరోగ్యానికి మంచిది కాదంటారు. కానీ ఐస్‌ బాత్ చేయడం మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. గడ్డ కట్టిన మంచులో కొన్ని క్షణాలపాటు గడపడం, ఐస్ క్యూబ్స్ వేసిన టబ్‌లో స్నానం చేయడం వంటి యాక్టివిటీస్‌ను ఇటీవల కొందరు పాటిస్తున్నారు. దీనినే కోల్డ్ వాటర్ థెరపీ అని కూడా పిలుస్తారు. అయితే చలికాలంలో ఇది మంచిదేనా? నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

మంచు గడ్డలను స్నానం చేసేటప్పుడు ఉపయోగించడంవల్ల నష్టంకంటే లాభమే ఎక్కువుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా చర్మ సమస్యలకు, కండరాల నొప్పికి ఇది విరుగుడుగా పనిచేస్తుంది. మిగతా సమయాలతో పోల్చితే ఐస్ బాత్ చేసినప్పుడు కండరాలు ఇన్‌స్టంట్ రిలీఫ్ పొందుతాయి. నొప్పి కూడా తగ్గుతుంది. రక్తనాళాలు, కండరాలు కుచించుకు పోవడంవల్ల తలెత్తే ఇబ్బందులు, నొప్పి, వాపు తగ్గుతాయి. బాడీలో బ్లడ్ సర్క్యుట్ సక్రమంగా జరుగుతుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సక్రమంగా సరఫరా అవుతుంది. అంతే కాకుండా ఐస్ బాత్ చేయడంవల్ల నాడీ వ్యవస్థకు ప్రేరణ లభిస్తుంది కాబట్టి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందట. ఇక చర్మాన్ని జిడ్డుగా ఉంచడంలో సహాయపడే సెబమ్ హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది కాబట్టి ఐస్ బాత్ వల్ల జిడ్డు చర్మం వంటి సమస్యలు ఉండవు. అయితే తరచూ ఎలర్జీలకు గురయ్యేవారికి ఐస్ బాత్ పడకపోవచ్చు. అలాంటివారు మాత్రం దూరంగా ఉండటం బెటర్.


Similar News