పొరపాట్లు జరిగాయా?.. స్వీయ క్షమాపణతో అధిగమించండిలా ..

జీవితంలో సెల్ఫ్ థింకింగ్, సెల్ఫ్ లవ్ ఎటువంటి పాత్ర పోషిస్తాయో సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ లేదా మిమ్మల్ని మీరు క్షమించుకోగలిగే స్వీయ క్షమాగుణం కూడా అంతే కీ రోల్ పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

Update: 2024-01-14 13:57 GMT

దిశ, ఫీచర్స్ : జీవితంలో సెల్ఫ్ థింకింగ్, సెల్ఫ్ లవ్ ఎటువంటి పాత్ర పోషిస్తాయో సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ లేదా మిమ్మల్ని మీరు క్షమించుకోగలిగే స్వీయ క్షమాగుణం కూడా అంతే కీ రోల్ పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఒక వ్యక్తి సక్సెస్ సాధించాలంటే తనపై తనకు నమ్మకంతోపాటు అనుకోకుండా జరిగే పొరపాట్లకు అనవసరంగా కుంగిపోకుండా, తనను తాను క్షమించుకోగలగాలి. ఇలాంటప్పుడే తర్వాత జరగబోయే పరిణామాలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం ఏర్పడుతుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. లైఫ్ అన్నాక ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంత కేర్ తీసుకున్నా కొన్నిసార్లు పరిస్థితులు ఎదురు తిరుగుతాయి. క్యాంపస్‌‌లో అయినా, వర్క్ ప్లేస్‌లో అయినా, చదువులో అయినా, చేసే వృత్తిలో అయినా రాణించాలంటే సందర్భాన్ని బట్టి మిమ్మల్ని మీరు క్షమించుకునే గుణాన్ని కలిగి ఉండాలి. అది మీలో సెల్ప్ ఎస్టీమ్‌ను పెంచుతుంది. సక్సెస్ వైపు నడిపిస్తుంది.

పొరపాట్లు సహజం కానీ వాటిని అంగీకరించపోవడమే అసలు సమస్య అంటారు పెద్దలు. అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా.. ముందుగా మీరు చేసిన పొరపాట్లను గుర్తించండి. వాటిని అంగీకరించండి. మీవల్ల జరిగిన తప్పులకు మీరే బాధ్యత వహించండి. అప్పుడు మీ మనసు స్వీయ క్షమాపణకు ఓకే చెప్తుంది. బాధాకర పరిస్థితుల నుంచి బయట పడగలుగుతారు. అంతేగాకని అంగీకరిస్తే నలుగురు ఏం అనుకుంటారోనని వెనుకడుగు వేస్తే, మిమ్మల్ని మీరు క్షమించుకోకుండా ఆలోచిస్తూ కూర్చుంటే నష్టపోతారు.

మిస్టేక్స్.. ఫ్రేమ్ వర్క్

సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ అనేది మీ ప్రవర్తన, ఆచరణకు సంబంధించిన ఒక ఫ్రేమ్‌వర్క్ లాంటింది. ఇందులో రెస్పాన్స్‌బిలిటీ, పశ్చాత్తాపం ఉంటాయి. చేయాల్సిందల్లా మీరు వాటిని ఫాలో అవడమే. అందుకోసం ముందు మీ బాధ్యతను గుర్తించండి. దీంతో జరిగిన గత సంఘటనలు లేదా సమస్యలు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేవు. ఎందుకంటే ఇక్కడ మీరు స్వీయ క్షమాపణను ఆశ్రయిస్తారు. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారు. లోపాలను అధిగమిస్తారు. విజయం సాధించాలనుకునేవారు చేయాల్సింది ఇదే అంటున్నారు నిపుణులు. మరొక విషయం ఏంటంటే.. మిస్టేక్స్ నుంచి నేర్చుకోగలగాలి. ఇతరుల తప్పులను ఎత్తి చూపేముందు మీ పొరపాట్లను కూడా అంగీకరిస్తే సక్సెస్ వైపు ఎలా నడవాలో మరొకరు చెప్పాల్సిన అవసరం ఉండదు.

వాస్తవాలను అంగీకరించండి

వాస్తవాలను గుర్తించడం, అంగీకరించడం మీరు నేర్చుకుంటే.. పొరపాట్లను తల్చుకుని కుంగిపోరు. వాటిని సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. జీవితంలో సహజంగా జరిగే చిన్న చిన్న ఘటనలకు, పొరపాట్లకు బాధపడకుండా సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ అనే ఆయుధం ద్వారా ఎదుర్కొంటారు. భవిష్యత్తులో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఏం చేయాలో ఆలోచిస్తారు. అయితే అంతకుముందు మీరు చేసిన పొరపాట్లను అంగీకరించి అధిగమించండి. దీనివల్ల మీలో కొండంత ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది. నిరాశా నిస్పృహలు దూరం అవుతాయి. సక్సెస్ జర్నీలో గమ్యం దగ్గరవుతుంది.


Similar News