ఈ పదార్థాలు మైక్రోవేవ్ ఓవెన్‌లో పెడుతున్నారా?.. ఆరోగ్యానికి హానికరం!

బిజీలైఫ్ షెడ్యూల్ కారణంగా ప్రస్తుతం చాలామంది వంటచేసుకోవడానికి, చల్లటి పదార్థాలు వేడిచేసుకొని తినడానికి తమ ఇండ్లల్లో మైక్రోవేవ్ ఓవెన్‌లను వాడుతున్నారు.

Update: 2024-01-03 06:05 GMT

దిశ, ఫీచర్స్ : బిజీలైఫ్ షెడ్యూల్ కారణంగా ప్రస్తుతం చాలామంది వంటచేసుకోవడానికి, చల్లటి పదార్థాలు వేడిచేసుకొని తినడానికి తమ ఇండ్లల్లో మైక్రోవేవ్ ఓవెన్‌లను వాడుతున్నారు. ముఖ్యంగా ఈ చలికాలంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని సక్రమంగా వాడకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని యూఎస్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది. కొందరు కూల్ వెదర్‌లో వేడి వేడిగా తినాలనిపించి అన్ని చిరుతిళ్లను కూడా వాటిలో పెట్టేస్తుంటారు. కానీ కొన్నింటిని పెట్టడంవల్ల హెల్త్ ఇష్యూస్ తలెత్తుతాయి.

త్వరగా ఉడకాలని ఎగ్స్‌ను మైక్రోవేవ్ఓ వెన్‌లో పెడుతుంటారు. కానీ.. ఇవి ఉడికే సమయంలో లోపలి టెంపరేచర్ మరింత పెరుగుతుంది. గుడ్డు పొరలు పొరలుగా విడిపోవడంతోపాటు టేస్టు కూడా మారుతుంది. పైగా అందులోని పోషకాలు నిశిస్తాయి. మరికొందరు బయటినుంచి పార్సిల్స్ తెచ్చినప్పుడు లేదా ఇంట్లో మిగిలిపోయిన పదార్థాలను ప్లాస్టిక్ కంటైనర్లలో పెట్టి మైక్రోవేవ్‌లో పెడుతుంటారు. ఈ పరిస్థితివల్ల వేడికి హానికరమైన కెమికల్స్‌ రిలీజ్ అవుతాయి. వాటిని తినడంవల్ల క్యాన్సర్, గొంతులో ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్యాలు సంభవించే అవకాశం ఉంటుంది. అంతేకాదు కొన్ని ప్లాస్టిక్స్ హీట్‌కు గురైనప్పుడు అవి మానవ ఎండోక్రైన్ సిస్టంపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపే చాన్స్ ఉంది. ఇక మిరియాలు కూడా మైక్రోవేవ్‌లో పెట్టవద్దట. ఎందుకంటే ఇవి అందులో వేడెక్కడంవల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అలాగే మెటల్, అల్యూమినియం ఫాయిల్స్ కూడా మైక్రోవేవ్‌లో ఉంచడంవల్ల ఓవెన్‌కు నష్టం జరగొచ్చు.


Similar News