కళ్లకింద నలుపు, చర్మంపై ముడతలు ఎందుకు వస్తాయి?.. నిపుణులు చెప్తున్నది ఇదే !

మనిషికి నిద్ర ఎంత ముఖ్యమో తెలిసిన తెలిసిన విషయమే. హెల్తీగా ఉండాలంటే కనీసం రోజుకు ఐదు గంటలకుపైగా నిద్రపోవాలి.

Update: 2024-01-20 09:50 GMT

దిశ, ఫీచర్స్ : మనిషికి నిద్ర ఎంత ముఖ్యమో తెలిసిన తెలిసిన విషయమే. హెల్తీగా ఉండాలంటే కనీసం రోజుకు ఐదు గంటలకుపైగా నిద్రపోవాలి. రాత్రిళ్లు నిద్ర మేల్కోవాల్సిన పరిస్థితులు ఉంటే.. ముఖ్యంగా నైట్‌‌షిఫ్ట్‌లు చేసేవారు పగలు, అలాగే పగలు ఉద్యోగాలు, వివిధ పనుల్లో నిమగ్నమయ్యేవారు రాత్రిళ్లు సరిపడా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండగలుగారు. కానీ దీర్ఘకాలంపాటు ఐదు గంటలకంటే తక్కువగా నిద్రపోతే మాత్రం అనేక సమస్యలు తలెత్తుతాయని ఇటీవల నిర్వహించిన అధ్యయనాలు కూడా పేర్కొంటున్నాయి. ముఖ్యంగా శరీరంలో ఏయే మార్పులు జరుగుతాయో నిపుణులు వివరిస్తున్నారు.

నిజానికి రోజుకు ఏడు గంటలపాటు నిద్ర ఉంటే మంచిది. కనీసం 5 నుంచి 6 గంటలు నిద్రపోయినా హెల్త్ ఇష్యూస్ తలెత్తవు. కానీ అంతకు తక్కువ అయితేనే ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ముఖ్యంగా శరీరంలో బలహీనత ఏర్పడటం, ముఖం అందవిహీనంగా తయారవడం, చర్మం డల్‌గా అనిపంచడం జరుగుతుంది. ఎందుకంటే బాడీకి తగినంత నిద్రలేకపోతే చర్మం సహజంగానే పొడిబారుతుంది. పీహెచ్ లెవల్స్ దెబ్బతింటాయి. దీనివల్ల తక్కువ ఏజ్ ఉన్నవారు కూడా ఎక్కువ వయస్సుగల వ్యక్తులుగా కనిపిస్తారు. దీర్ఘకాలంపాటు నిద్రలేని పరిస్థితులు అనుభవిస్తే చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు ఏర్పడతాయి.

కళ్లకింద నలుపు, వాపు

చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో కళ్లకింద నలుపు ఒకటి. కంటినిండా నిద్రలేకపోతే కూడా ఇలాంటి డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి నిద్రపోతున్నప్పుడు బాడీలో దెబ్బతిన్న కణాలు కూడా రీ ప్రొడక్ట్ అవుతాయి. నిద్రలేకపోతే ఆ పరిస్థితి ఆగిపోతుంది. అందువల్ల కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. అలాగే కళ్లకింద వాపు లేదా ఉబ్బినట్లుగా మారడం కూడా నిద్రలేమి వల్ల జరుగుతుంది. అందుకే దీర్ఘకాలంపాటు నిద్రకు దూరమైన వారి ముఖం కళ తప్పుతుంది.

ముఖంపై ముడతలు, జుట్టు రాలడం

రోజు 5 గంటలకు మించి నిద్రపోయేవారిలోని శరీరంలో కొల్లాజెన్ అనే హార్మోన్ తగిన స్థాయిలో రిలీజ్ అవుతుంది. అంతకంటే తక్కువసేపు నిద్రపోతే లేదా నిద్రలేమితో బాధపడేవారిలో ఇది ప్రొడ్యూస్ అవడం ఆగిపోతుంది. చర్మం నిగారింపులో కీలకంగా ఉండే కొల్లాజెన్ లేకపోవడంవల్ల చర్మంపై ముడతలు ఏర్పడతాయి. ఫలితంగా ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ లెవల్ పెరుగుతుంది. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాకుండా 5 గంటలకంటే తక్కువ నిద్రపోవడం అనేది రొటీన్‌గా మారినప్పుడు తలపై వెంట్రుకలకు తగిన పోషకాలు అందడం ఆగిపోతుంది. జుట్టు నిర్జీవంగా మారడం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే సరిపోను నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Similar News