మ్యూజిక్ మంత్ర.. వైద్య చికిత్సల్లో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్న నిపుణులు

Update: 2024-01-15 05:51 GMT

దిశ, ఫీచర్స్ : మ్యూజిక్‌ వినడం మానసిక వికాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే కొందరు రిలాక్సేషన్ కోసం వింటూ ఉంటారు. మరికొందరు వ్యాయామాల సమయంలో, ఇంకొందరు జర్నీ చేస్తున్నప్పుడు ఉత్సాహంగా ఉండేందుకు ఇష్టమైన మ్యూజిక్ వింటారు. మొత్తానికి హ్యాపీనెస్, యాక్టివ్‌నెస్ పెంచడంలో సంగీతం కీ రోల్ పోషిస్తుందని అందరూ అంగీకరిస్తారు. అయితే ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజరుస్తుందని, పేషెంట్లు వాడే మెడిసిన్ మరింత సమర్థవంతంగా పనిచేసేలా ప్రేరేపిస్తుందని రీసెంట్ స్టడీలో వెల్లడైంది. గత అధ్యయనాలు కూడా నొప్పి, ఆందోళన వంటి సమస్యలకు ట్రీట్మెంట్ అందించే సమయంలో మ్యూజిక్ వినిపించే మెథడ్‌ను ఫాలో అయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా ప్రజెంట్ కీమో థెరపీ, వివిధ క్రిటికల్ సర్జరీల సమయంలోనూ అదెలా పనిచేస్తుందో మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన వైద్య నిపుణుల అబ్జర్వ్ చేశారు. మ్యూజిక్ ఎటువంటి ప్రయోజనాలు కలిగిస్తుందో వెల్లడించారు.

సహజంగా మనుషుల్లో వివిధ ఆలోచనలు, ఆందోళన, నొప్పి వంటి భావాలు మెదడు, నాడీ సంబంధిత వ్యవస్థతో ముడిపడి ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే కీమోథెరపీ-ప్రేరిత వికారం కూడా నాడీ వ్యవస్థ రియాక్షన్ వల్ల కలుగుతుంది. అందుకే దీనికి ట్రీట్మెంట్ చేసే సందర్భంలో, మెడిసిన్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో రోగులు విముఖత చూపుతుంటారు. ఇలాంటప్పుడు వీరికి మ్యూజ్ వినిపించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని రీసెర్చర్స్ కనుగొన్నారు. స్టడీలో భాగంగా వారు కీమోథెరపీ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న 14 మంది పేషెంట్లకు ట్రీట్మెంట్, అలాగే మెడిసిన్ తీసుకోవాల్సిన సమయానికి ముందు 30 నిమిషాల పాటు ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించాలని సూచించారు. అలా సంగీతం విన్నవారు హ్యాపీగా ఫీలవడం ట్రీట్మెంట్‌కు సహకరించడం, అలాగే వారు తీసుకున్న మెడిసిన్స్ ఎఫెక్టివ్‌గా పనిచేయడం పరిశోధకులు కనుగొన్నారు. మ్యూజిక్ విన్నప్పుడు బ్రెయిన్‌లోని ఆల్ న్యూరాన్స్ ఉత్తేజితం అవడం, ప్రేరణ పొందమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.


Similar News