తిన్న పది నిమిషాలకే మళ్లీ ఆకలి వేస్తోందా ?.. కారణం ఇదే !

ఆకలి వేయడం, ఇష్టమైన ఆహారం తినడం మానవ లక్షణం. కానీ తిన్న ఐదు లేదా నిమిషాలకే మళ్లీ తినాలనిపిస్తే, దాంతోపాటు గుండె దడ, కళ్లు బైర్లు కమ్మడం వంటి ఇబ్బందలు తలెత్తితే అనుమానించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.

Update: 2024-01-23 13:46 GMT

దిశ, ఫీచర్స్ : ఆకలి వేయడం, ఇష్టమైన ఆహారం తినడం మానవ లక్షణం. కానీ తిన్న ఐదు లేదా నిమిషాలకే మళ్లీ తినాలనిపిస్తే, దాంతోపాటు గుండె దడ, కళ్లు బైర్లు కమ్మడం వంటి ఇబ్బందలు తలెత్తితే అనుమానించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే టైప్ -2 డయాబెటిస్ ప్రారంభానికి ముందు కూడా కొందరిలో ఇవే లక్షణాలు పొడచూపుతాయట. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగడంవల్ల ఇలా జరుగుతుంది. నిజానికి టైప్ 2 మధుమేహం జీవక్రియను ప్రభావితం చేస్తుంది. బాధితుల్లో గ్లూకోజ్ లెవల్స్‌‌లో హెచ్చు తగ్గులు సంభవిస్తుంటాయి. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా యూజ్ చేసుకోలేనప్పుడు అధిక ఆకలి, దామం వంటివి అనిపిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే కొంతకాలానికి చేస్తే కిడ్నీలు, హార్ట్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.

రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరిగినప్పుడు, అలాగే తగ్గినప్పుడు కూడా అధికంగా దాహం వేయడం, ఆకలి వేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు బాధితులు రెండుమూడు బాటిళ్ల నీళ్లు తాగినా దాహం తీరదు. తరచుగా యూరిన్‌కు వెళ్లాలనిపిస్తుంది. గ్లూకోజ్ లెవల్స్ క్రాశ్ అయ్యే క్రమంలో గుండె వేగంగా కొట్టుకోవడం, కాళ్లు, చేతులు చెమటలు పట్టడం, కళ్లు తిరగడం వంటివి ఆకస్మికంగా సంభవిస్తాయి. దీంతోపాటు కొన్నిసార్లు బ్రెయిన్‌లోని న్యూరాన్స్‌ మధ్య సిగ్నలింగ్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడంవల్ల గందరగోళం ఏర్పడుతుంది. ఇక మహిళల విషయానికి వస్తే బ్లడ్ షుగర్ పెరగడంవల్ల శరీరంలో టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్పత్తి అయి తలపై వెంట్రుకలు రాలడం, ముఖంపై వెంట్రుకలు పెరగడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనే వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వైద్య నిపుణులను సంప్రదించాలి.


Similar News