కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతాయి?.. ఎలా గుర్తించాలి?

మనిషి జీవించడానికి అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఎప్పుడైతే అవి పాడవుతాయో అప్పుడు మరణం సంభవిస్తుంది. అందుకే వైద్య నిపుణులు కిడ్నీల ఆరోగ్యంపై తరచూ హెచ్చరికలు, పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.

Update: 2024-01-02 07:24 GMT

దిశ, ఫీచర్స్ : మనిషి జీవించడానికి అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఎప్పుడైతే అవి పాడవుతాయో అప్పుడు మరణం సంభవిస్తుంది. అందుకే వైద్య నిపుణులు కిడ్నీల ఆరోగ్యంపై తరచూ హెచ్చరికలు, పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.వాస్తవానికి బాడీలోని ఫ్లూయిడ్స్‌ నుంచి వేస్టేజ్‌ను, అవసరంలేని నీటిని కిడ్నీలు వడబోసి మూత్రం ద్వారా బయటికి పంపుతాయి. అందుకే కిడ్నీలు మానవులకు చాలా ముఖ్యం. అయితే ఇండియాలో హెల్త్ ఇష్యూస్ వల్ల సంభవించే మరణాలకు ప్రధాన కారణాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా అధికంగానే ఉంటున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసర్చ్ నివేదిక పేర్కొన్నది. పలు నేషనల్ హెల్త్ రిపోర్ట్స్ కూడా అదే పేర్కొంటున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్, హైబీపీ, ఏజింగ్ ఇష్యూస్ వల్ల కిడ్నీ డిసీజెస్ అధికంగా సంభవిస్తున్నాయి. ఇక వరల్డ్ వైడ్‌గా దాదాపు 6.96 కోట్ల మందికిపైగా కిడ్నీ బాధితులు ఉంటే.. మన దేశంలోనే 1.14 కోట్లకు పైగా ఉన్నారు. మరణాల విషయానికి వస్తే 14 నుంచి 70 ఏండ్లలోపు వారిలో 2.9 శాతం మంది కేవలం కిడ్నీ ఫెయిల్యూర్స్ వల్ల చనిపోతున్నారు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి కిడ్నీపాడైందని ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

ఈ లక్షణాలు కనిపిస్తే.. బీ కేర్‌ఫుల్

శరీరంలో కిడ్నీలు పాడైనట్లయితే కొన్ని లక్షణాలు, శారీరక మార్పలు సంభవిస్తాయని నెఫ్రాలజిస్టులు అంటున్నారు. ముఖ్యంగా యూరిన్ ద్వారా ప్రొటీన్ బయటికి పోతూ ఉంటుంది. హెల్తీగా ఉన్న వ్యక్తుల్లోనూ ఇలా జరుగుతుంది. కానీ ప్రోటీన్ తక్కువ మోతాదులో బయటకి పోతుంది. కిడ్నీలు చాలా వీక్‌గా లేదా పాడైనప్పుడు మాత్రం ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో బయటకు వెళ్తుంది. ఈ పరిస్థితిని నిపుణులు ‘ప్రొటీన్యూరియా’గా పరిగణిస్తున్నారు. శరీరంలో ఇటువంటి ఇష్యూస్ తలెత్తడానికి మెయిన్ రీజన్ డయాబెటిస్, హైబీపీ. వాటిని నియంత్రణలో ఉంచుకోలేకపోతే క్రమంగా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశం లేకపోలేదు. ఇక మరొక లక్షణం ఏంటంటే యూరిన్ కలర్‌ను బట్టి కూడా కిడ్నీలు పాడైంది, లేనిది గుర్తించవచ్చునట. మూత్రంలో నీరు, యూరియా, లవణాలు కలిసి ఉంటాయి. బాడీలో ఎమినో యాసిడ్స్ ఎక్కువగా స్టోరేజ్ ఉన్నప్పుడు లివర్ యూరియాను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది శరీరంలోని ఫ్లూయిడ్స్ ద్వారా వచ్చే వ్యర్థం పదార్థం. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రకారం ఫ్లూయిడ్స్‌ను కిడ్నీలు శుభ్రపరుస్తాయి. ఈ క్రమంలో అవి తర్వాత రక్తంలో కలిసిపోతాయి. కామన్‌గా యూరిన్ కలర్ లైట్ ఎల్లో నుంచి డార్క్ బ్రౌన్ వరకు వివిధ రకాలుగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కాగా ఎవరికైనా మూత్రం రెడ్ కలర్‌లో, డార్క్ బ్రౌన్ లేదా ఇతర ఏ డార్క్ కలర్లో వచ్చినా కిడ్నీలు పాడైనట్లు అనుమానించవచ్చని నెఫ్రాలజిస్టులు అంటున్నారు. కాబట్టి యూరిన్ కలర్ అనుమానించదగ్గది అయినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.


Similar News