పోశ్చర్ సరిగ్గా లేకపోతే ఇన్ని సమస్యలా?.. ఏం జరుగుతుందంటే..
ఆరోగ్యానికి కరమైన జీవితానికి వ్యాయామాలు, ఆహారమే కాదు, రోజూ మీరు కూర్చునే, నిల్చునే తీరు కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మీ బాడీ పోశ్చర్(భంగిమ) సెట్ అవకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
దిశ, ఫీచర్స్ : ఆరోగ్యానికి కరమైన జీవితానికి వ్యాయామాలు, ఆహారమే కాదు, రోజూ మీరు కూర్చునే, నిల్చునే తీరు కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మీ బాడీ పోశ్చర్(భంగిమ) సెట్ అవకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్క్ ప్లేస్‌లో కుర్చీపై కూర్చునే విషయంలో సరైన పోశ్చర్ లేకపోతే దీర్ఘకాలిక నొప్పులకు కారణం అవుతుంది. ముఖ్యంగా మెడనొప్పి, నడుము నొప్పి వంటివి వస్తుంటాయి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు పోశ్చర్ సరిగ్గా లేకపోతే సడెన్‌గా నడుములు, మెడలు పట్టేస్తుంటాయి. వినడానికి చిన్న సమస్యలుగానే అనిపిస్తాయి. కానీ ఆరోగ్యపరంగా మిమ్మల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ప్రధానంగా వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ఉద్యోగులు అయితే పనిచేసుకోవడానికి అవస్థలు పడాల్సి ఉంటుంది. అందుకే సరైన పోశ్చర్, దానివల్ల తలెత్తే ఇబ్బందులు, నివారణ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటే..
కొందరికి పడుకునే పోశ్చర్ సక్రమంగా లేకపోతే మెడ నొప్పి రావచ్చు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే మెడ కింద ఎత్తైన దిండుకి బదులు పలుచటి దిండుని వాడడం బెటర్. కుర్చీపై కూర్చొని పనిచేస్తున్నప్పుడు వెన్నెముక కింది భాగాన్ని బ్యాక్ రెస్ట్‌కు ఆనించి కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి వస్తుంది. అలాగే కొందరికి తరచూ కాలు మీద కాలు వేసి కూర్చునే అలవాటు ఉంటుంది. దీనివల్ల కాలి తొడలు, మోకాళ్లు, నడుము కింద భాగం, పాదాలకు బ్లడ్ సర్క్యూట్ సరిగ్గా జరగకపోవడంవల్ల తిమ్మిర్లు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఈ సమస్యలను ఎదుర్కొనే వారు కూర్చునే తీరును మార్చుకోవాలి.
బ్యాక్ సైడ్ ఎక్కువగా వాలినప్పుడు..
కూర్చొని వర్క్ చేసేటప్పుడు కొందరు బ్యాక్ సైడ్ వాలిపోతూ ఉంటారు. ఈ పోశ్చర్ వల్ల వెన్నెముకపై భారం పడుతుంది. కింది భాగంలో ఒత్తిడి పెరిగి నొప్పికి దారితీస్తుంది. కాబట్టి కేర్ తీసుకోవాలి. ఇక బోర్లా పడుకునే అలవాటు వల్ల కూడా వెన్నుపూసపై ఒత్తిడి పెరుగుతుంది. బ్రీతింగ్‌లోనూ అరుదుగా ఇబ్బందులు తలెత్తవచ్చు. పైగా బోర్లా పడుకోవడం వల్ల జీర్ణాశయంపై కూడా ఒత్తిడి పెరిగి డైజేషన్ ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చు. కాబట్టి మీరు శరీరంలోని పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నప్పుడు రోజువారీగా కూర్చునే, పడుకునే పోశ్చర్స్ గురించి కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా మెడను ఎక్కువసేపు వంచడం, ఒకేచోట గంటలు గంటలు కూర్చోవడం, కాళ్లు ఎక్కువగా ఊపడం, ముందుకు వంగి బైకు నపడం వంటి పోశ్చర్స్ వల్ల సమస్యలు తలెత్తతాయి. మీ సమస్యను నివారించడానికి సరైన పోశ్చర్‌ను ఎంచుకోడంవల్ల చక్కటి పరిష్కారం లభిస్తుంది.