పిల్లలు ఆరుబయట ఆడుకునే పరిస్థితి లేదా?.. స్క్రీన్ ఫ్రీ ఇండోర్ యాక్టివిటీస్‌ను ప్రోత్సహించండి

ఆరు బయట, పార్కుల్లో ఆడుకోవడానికి పిల్లలు చాలా ఇష్టడుతుంటారు. కానీ వాతావరణ పరిస్థితులు, సురక్షితమైన ఖాళీ స్థలాలు లేకపోవడం ఇందుకు ఆటంకంగా మారుతుంటాయి. ఇలాంటప్పుడు తమ పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్లకు

Update: 2023-08-03 07:03 GMT

దిశ, ఫీచర్స్  : ఆరు బయట, పార్కుల్లో ఆడుకోవడానికి పిల్లలు చాలా ఇష్టడుతుంటారు. కానీ వాతావరణ పరిస్థితులు, సురక్షితమైన ఖాళీ స్థలాలు లేకపోవడం ఇందుకు ఆటంకంగా మారుతుంటాయి. ఇలాంటప్పుడు తమ పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్లకు అతుక్కుపోతుంటారని, ఇది వారి ఆరోగ్యంపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుందని పేరెంట్స్ ఆందోళన చెందుతుంటారు. కానీ దీనికి చక్కటి ప్రత్యామ్నాయం ఉందని నిపుణులు చెప్తున్నారు. అదేంటంటే.. బయట ఆడుకోవడానికి అవకాశంలేకపోతే, ఇంట్లోనే ఉండి క్రియేటివ్ అండ్ ఇమాజినేషన్ ఇండోర్ యాక్టివిటీస్‌లో పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు.

ముఖ్యంగా కథలు చెప్పడం పిల్లల్లో మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తుందట. పైగా ఇది అనాదిగా యువ హృదయాలను దోచుకునేలా సాగుతున్న సంప్రదాయమని పెద్దలు చెప్తుంటారు. దీంతోపాటు వయస్సుకు తగిన పుస్తకాలను పిల్లలకు అర్థం అయ్యేలా చదివి వివరించడం, వారిని ఆనంద పరిచే అంశాలను జోడించి చెప్పడం మేలు చేస్తుంది. భాషా నైపుణ్యాలను పెంచేందుకు ఎంపిక చేసిన రచనలు చదివించవచ్చు. అలాగే దాగుడు మూతల ఆటలు, వివిధ వస్తువులను దాచి క్లూస్ ఆధారంగా వెతకడం వంటి టాస్కులను ప్రోత్సహించాలి. దీనివల్ల పిల్లల్లో మల్టీ టాస్కింగ్ స్కిల్స్ పెరుగుతాయి. కొన్ని వస్తువులను ఆయా ప్లేస్‌లలో పిల్లల ద్వారా పెట్టించి, తర్వాత ఏ వస్తువు ఎక్కడ పెట్టారో అడగడం చేస్తుంటే వారిలో జ్ఞాపశక్తి పెరగడానికి దోహదం చేస్తుంది. ఇక ఇంట్లోనే బెడ్‌పై ఉండే దిండ్లు, దుప్పట్లు, వివిధ బొమ్మలను ఉపయోగించి గుహల మాదిరి నిర్మించడం, పక్షులకు అవసరమైన స్థావరాల ఆకారాలు క్రియేట్ చేయడం వంటి ఇమాజినేషన్ ఇండోర్ గేమ్స్‌ను ప్రోత్సహించడం ద్వారా పిల్లల్లో క్రియేటివిటీ, మల్టీ టాస్కింగ్ ప్రాబ్లం సాలోయింగ్ నాలెడ్జ్ పెరుగుతాయి.

Read More : బేబీ కార్న్‌తో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?


Similar News