పిల్లలను అలరిస్తున్న ఏఐ ఆధారిత బొమ్మలు.. లాభమా?.. నష్టమా?

ప్రస్తుతం కొన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ ఏదో ఒక రూపంలో యూజ్ అవుతోంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగంలో బ్లడ్ టెస్టులు మొదలుకొని వివిధ మెడికల్ రిపోర్టుల ఎనలైజింగ్ వరకు కీలకంగా మారుతోంది.

Update: 2024-01-25 09:23 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం కొన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ ఏదో ఒక రూపంలో యూజ్ అవుతోంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగంలో బ్లడ్ టెస్టులు మొదలుకొని వివిధ మెడికల్ రిపోర్టుల ఎనలైజింగ్ వరకు కీలకంగా మారుతోంది. రోగాల నిర్ధారణకు, సర్జరీలకు ఏఐ ఆధారిత రోబోట్స్‌ను యూజ్ చేస్తున్నారు. అయితే ఇటీవల మార్కెట్లో ఏఐ టెక్నాలజీ ఆధారిత స్మార్ట్ టాయ్స్ కూడా పిల్లలను ఆకట్టుకుంటున్నాయి. దీనిని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఏఐ టాయ్స్ పిల్లలకు మరో మోటివేటివ్, కమ్యూనికేటివ్ లెర్నింగ్ స్కిల్స్ ప్రపంచంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.

న్యూ వేవ్ సెట్టర్స్

ఇటీవల సోషల్ మీడియాలో ఏఐ స్మార్ట్ టాయ్స్ గురించి డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే ఇవి సాంప్రదాయ ఆట బొమ్మలకు భిన్నంగా పిల్లల్లో లెర్నింగ్ సామర్థ్యాన్ని మార్చడంలో, పెంచడంలో సరి కొత్త వేవ్ సెట్టర్స్‌గా ఉంటున్నాయి. ప్రజలు కూడా వాటిని అంగీకరిండానికి రెడీగా ఉంటున్నారు. ఈ కృత్రిమ మేధస్సు కారణంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో పిల్లలు తెలివిగా మారుతున్నారు. తమ చిన్ని చిన్ని అవసరాలు తీర్చుకోవడానికి, ఆడుకోవడానికి, చదువుకోవడానికి ఏఐ టెక్నాలజీ ప్రత్యక్షంగానో, పరీక్షంగానో యూజ్ అవుతోంది.

ప్లేయర్ ఎబిలిటీస్

వాస్తవానికి ఏఐ స్మార్ట్ టాయ్స్ అనేవి ఇంటరాక్టివ్ ఎలక్ట్రానిక్ బేసిస్‌గా ఉంటున్నాయి. ఇవి వాటిలో ముందుగానే అమర్చిన నమూనాల ప్రకారం ప్రవర్తిస్తాయి. బాహ్య ఉద్దీపనల ఆధారంగాను తమ బిహేవియర్‌ను మార్చగలవు. ముఖ్యంగా అవి ప్లేయర్ ఎబిలిటీస్‌ను అడ్జస్ట్ చేయగలవు. ఈ టాయ్స్ ప్లేయర్స్ యాక్టివిటీస్‌కు లేదా ప్రీ-ప్రోగ్రామింగ్‌కు ప్రతిస్పందిస్తాయి. క్లౌడ్ కంప్యూటింగ్, AI సెన్సార్-ఆధారిత సాంకేతికతలతో శక్తిని పొందుతాయి. అయితే స్మార్ట్ టాయ్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

సోషల్ స్కిల్స్

 పిల్లలు ఏఐ ఆధారిత స్మార్ట్ టాయ్స్ ద్వారా ఆనందాన్ని పొండడమే కాకుండా ఆలోచన సామర్థ్యాన్ని పెంచుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. తార్కికత అభివృద్ధి అవుతుంది. ఏఐ టాయ్స్ పరిస్థితుల పట్ల వైఖరిని ఎనేబుల్ చేస్తాయి. సామాజిక పరస్పర చర్యతో పిల్లలు వివిధ భావోద్వేగాలను, భావాలను గుర్తించడంలో సహాయపడతాయి. దీనివల్ల సోషల్ స్కిల్స్ మెరుగుపడుతాయి.

లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్‌మెంట్

పిల్లలలో కాగ్నెటివ్ స్కిల్స్ డెవలప్ అవడంలో ఏఐ ఆధారిత స్మార్ట్ టాయ్స్ కీ రోల్ పోషిస్తాయి. వారిలో అభివృద్ధికి దారితీసే ఊహాశక్తిని కూడా పెంచుతాయి. వేరియస్ ఫంక్షనాలిటీస్ వల్ల వివిధ సామర్థ్యాలు డెవలప్ అవుతాయి. అంతేకాకుండా స్మార్ట్ టాయ్స్ యొక్క అతిపెద్ద USP వాటి టీచింగ్ కెపాబిలిటీ లేదా ఎడ్యుకేషన్‌పై కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఏఐ బేసిస్ బొమ్మలు పిల్లలకు టెక్నాలజీ అండ్ డిజిటల్ వరల్డ్‌ను పరిచయం చేస్తాయి. బేసిక్ STEM అవగాహనను అందిస్తాయి. లెర్నింగ్ స్కిల్స్‌ను, కెపాసిటీని పెంచుతాయి.

సెల్ఫ్ ఎస్టీమ్

పిల్లల్లో ఆత్మగౌరవం లేదా ఆత్మ విశ్వాసాన్ని ఏఐ బొమ్మలు పెంపొందిస్తాయి. చక్కటి మోటార్ స్కిల్స్‌కు డెవలప్ అయ్యేందుకు దోహదం చేస్తాయి. మరో ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఒంటరి సంతానాన్ని కలిగి ఉన్న భాగస్వాములకు తమ పిల్లల్లో వివిధ స్కిల్స్ పెంచడానికి ఇవి చాలా అవసరం. ఇంటరాక్టివ్ స్మార్ట్ టాయ్స్ పిల్లలు ఫీడ్‌బ్యాక్ అండ్ కమ్యూనికేషన్ స్టైల్స్‌ను డెవలప్ చేయడంలో సహాయపడతాయి. పిల్లల బలహీనత, బలాన్ని పేరెంట్స్ అంచనా వేయడంలో, అర్థం చేసుకోవడంలో హెల్ప్ అవుతాయి.

వర్చువల్ టాయ్స్

Google కార్డ్‌బోర్డ్, శామ్‌సంగ్ గేర్ అండ్ ఓకులస్ రిఫ్ట్ అనేవి వర్చువల్ రియాలిటీని, ఆగ్మెంటెడ్ రియాలిటీని కలిగి ఉన్న కొన్ని స్మార్ట్ టాయ్స్. మరికొన్ని ఇంటర్నెట్ ఆధారిత టాయ్స్ కూడా కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, ప్లేయర్స్‌ను ట్రాక్ చేయడానికి, అంచనా వేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి కూడా AIని ఉపయోగించవచ్చు. GoCube స్మార్ట్ టాయ్ ఇందుకు చక్కటి ఉదాహరణ. ఇక emotix Miko కంపానియన్ రోబోట్స్ డీప్ లెర్నింగ్ AI ద్వారా శక్తిని పొందుతాయి. పిల్లలతో ఎలా కనెక్ట్ అవ్వాలో Mikoకు బాగా తెలుసు. ఇది ఉత్సుకత, వ్యక్తీకరణ వంటి భావాలను పెంపొందిస్తుంది.

సమస్యలు- సవాళ్లు

ఏఐ టెక్నాలజీ లేదా స్మార్ట్ టాయ్స్ ఎంత మేలు చేస్తాయని భావిస్తామో కొన్ని సందర్భాల్లో డేటా ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీ వంటి సమస్యలకు కూడా చాన్స్ ఉంటుంది. ముందుగానే అమర్చబడిన సాఫ్ట్ వేర్ ఆధారిత స్కిల్స్, లెర్నింగ్స్, డిఫరెంట్ బిహేవియరల్ టూల్స్ ఉంటాయి. వీటిలో అనుకోకుండా లోపం తలెత్తితే అవి పిల్లలను తప్పుగా కమ్యూనికేట్ చేసే చాన్స్ లేకపోలేదు. కాకపోతే ఇలాంటివి జరిగే చాన్స్ చాలా తక్కువ. ఎంతకైనా మంచిది ఏఐ టాయ్స్ వాడటంతోపాటు వాటి గురించిన అవగాహన పిల్లల్లో , పెద్దల్లో అవసరమని నిపుణులు చెప్తున్నారు.


Similar News