Trends : అందంగా మెరిసిపోవాలా..? ఈ ‘కొరియన్ బ్యూటీ’ టిప్స్ ఫాలో అయిపోండి!

Trends : అందంగా మెరిసిపోవాలా..? ఈ ‘కొరియన్ బ్యూటీ’ టిప్స్ ఫాలో అయిపోండి!

Update: 2025-03-18 13:11 GMT
Trends : అందంగా మెరిసిపోవాలా..? ఈ ‘కొరియన్ బ్యూటీ’ టిప్స్ ఫాలో అయిపోండి!
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : ‘‘మీ ముఖం అందంగా మెరిసిపోవాలా? అయితే కొరియన్ బ్యూటీ టిప్స్ ఫాలో అవండి’’ సోషల్ మీడియాలో పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లు తరచుగా చెప్పే మాటలివి. ముఖ సౌందర్యం కోసం వాళ్లు ఏం వాడుతారో కాసేపు పక్కన పెడితే, కొరియన్ యువతీ యువకుల స్కిన్‌టాన్ సహజంగానే ఆకట్టుకుంటుంది. చూడ్డానికి అందంగా, ఫ్లా లెస్‌గా, స్మూత్‌గా కనిపిస్తుంది. దీంతో మార్కెట్లో కొరియన్ బ్యూటీ పేరుతో వచ్చే ప్రొడక్ట్స్‌ కొనడానికి కూడా యూత్ ఆసక్తి చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ కొరియన్ బ్యూటీ టిప్స్ లేదా ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయి? అవేమిటో ఇప్పుడు చూద్దాం.

* డబుల్ క్లెన్సర్ : కొరియన్ స్కిన్ కేర్‌లో డెప్త్ లేదా డబుల్ క్లెన్సింగ్ ఒకటి. స్కిన్ టోన్‌ను అందంగా మార్చడంలో ఇది ప్రసిద్ధి చెందింది. స్కిన్ అప్పర్ లేయర్స్‌ను బాగా ఎక్స్‌ఫోలియేటెడ్ చేయడానికి డబుల్ క్లెన్సింగ్ చేస్తారు. ఇందులో భాగంగా మొదట ఆయిల్‌తో కూడిన క్లెన్సర్ అప్లయ్ చేసి, ఆ తర్వాత నీటితో శుభ్రం చేస్తారు. ఇది చర్మంపైన మురికిని, డెత్ స్కిన్‌ను, మేకప్‌ను, జిడ్డును తొలగించి తళ తళా మెరిసేలా చేస్తుంది.

* కె. బ్యూటీ : తరచూ బయట తిరగడం, విభిన్న వాతావరణ పరిస్థితుల్లో గడపడం.. ఇలా కారణాలేమైనా అప్పుడప్పుడూ ముఖంలోని చర్మం దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా పైపొర కూడా డీహైడ్రేషన్‌కు గురవుతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ముఖ వర్ఛస్సు తగ్గుతుంది. ఈ పరిస్థితిని నివారించడానికి కొరియన్ స్కిన్ హైడ్రేషన్ లేదా కె. బ్యూటీ టిప్స్ అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సోయాబీన్స్, బియ్యం, పులియబెట్టిన వివిధ పదార్థాల ద్వారా తయారు చేసిన ఉత్పత్తులను ఈ సందర్భంగా వాడుతారు. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ప్రస్తుతం కొరియన్ బయో రీమోడలింగ్, హైడ్రో స్ట్రెచ్ థెరపీలు కూడా ప్రసిద్ధి చెందాయి.

*అలర్జీలు దూరం :  యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేసే విటమిన్ సి, గ్రీన్ టీ, నియాసినామైడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ‘కొరియన్ బ్యూటీ’ ప్రొడక్ట్స్ స్కిన్ అలెర్జీలను, చర్మంపై మంటను నివారిస్తాయని, డెత్‌ సెల్స్‌ను పోగొట్టడం ద్వారా చర్మ సౌందర్యాన్ని పెంచుతాయని నిపుణులు చెబతున్నారు. అంతేకాకుండా వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. చర్మంపై ముడతలను నివారించి గ్లోను పెంచుతాయి.

Tags:    

Similar News