తిన్నవెంటనే నిద్ర ముంచుకొస్తోందా?.. దటీజ్ ఫుడ్ కోమా !
రాత్రిపూట నిద్రపట్టకపోతే గనుక పగలు నిద్ర ముంచుకొస్తుంది. ఇది ఎవరికైనా సహజం. కానీ డే టైంలో తిన్నవెంటనే తట్టుకోలేనంతగా నిద్ర ముంచుకు రావడం దేనికి సంకేతం? దీనినే వైద్య పరిభాషలో ఫుడ్ కోమాగా పేర్కొంటున్నారు నిపుణులు.
దిశ, ఫీచర్స్ : రాత్రిపూట నిద్రపట్టకపోతే గనుక పగలు నిద్ర ముంచుకొస్తుంది. ఇది ఎవరికైనా సహజం. కానీ డే టైంలో తిన్నవెంటనే తట్టుకోలేనంతగా నిద్ర ముంచుకు రావడం దేనికి సంకేతం? దీనినే వైద్య పరిభాషలో ఫుడ్ కోమాగా పేర్కొంటున్నారు నిపుణులు. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న వారు ఎంత పనిలో ఉన్నప్పటికీ నిద్రను ఆపుకోలేరు. కళ్లు మూతపడుతుంటాయి. ఆవలింతలు ఎక్కువగా వస్తుంటాయి. ప్రజెంట్ చాలా మంది ఈ ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నారు. అయితే ఇదొక వ్యసనంలాగో, రుగ్మతలాగో మారితే మాత్రం దానిని పోస్ట్‌ప్రాండియల్ సొమ్నోలెన్స్ అని కూడా పేర్కొంటారు. ప్రజెంట్ చాలామందిని ఇది వేధిస్తోంది. ఈ బలహీనత నుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
ముఖ్యంగా పగలు పూట లిమిటేషన్‌కు మించి తినడం, పిజ్జా, బర్గర్స్, బిర్యానీలు, సమోసాలు, కేకులు, వివిధ చిరుతిళ్లు వంటివి ఎక్కువగా తినడంవల్ల కూడా ఫుడ్ కోమా ఏర్పడుతుంది. దీనివల్ల బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను ప్రభావితం అవుతాయి. హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. అందుకే ఫుడ్ కోమాకు లేదా పోస్ట్ ప్రాండియల్ సోమ్నోలెన్స్ వంటి రుగ్మతలకు రాకుండా ఉండాలంటే బేకరీ ఫుడ్స్, బయటి మార్కెట్లోని ఫుడ్స్, ఎక్కువగా ఆయిల్, మసాలా వాడిన ఆహారాలుు తినడం తగ్గించాలని నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోవడం చాలా మంచిది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, కార్బోనేటేడ్ డ్రింక్స్ ఎక్కువగా తినడంవల్ల కూడా డే టైంలో బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరగడం, నిద్ర ముంచుకు రావడం జరుగుతాయి. క్రమంగా అవి ఫుడ్ కోమాకు కారణం అవుతాయి. అందుకే వాటిని నివారించాలి. లంచ్ టైంలో ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే హెల్తీ ఫుడ్స్, తాజా పండ్లు వంటివి తీసుకోవడంవల్ల ఫుడ్ కోమా అనే అతినిద్ర సమస్యను దూరం చేసుకోవచ్చు.