పురుషులకంటే స్త్రీలే బలవంతులా?. నిపుణులు ఏం చెప్తున్నారు?
స్త్రీలు, పురుషుల్లో శారీరకంగా, మానసికంగా ఎవరు బలవంతులు? ఆపదలు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎవరు దృఢంగా ఉంటారు? చాలామంది పురుషులనే అంటారు.
దిశ, ఫీచర్స్ : స్త్రీలు, పురుషుల్లో శారీరకంగా, మానసికంగా ఎవరు బలవంతులు? ఆపదలు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎవరు దృఢంగా ఉంటారు? చాలామంది పురుషులనే అంటారు. కానీ ఇది నిజం కాదని డెన్మార్క్‌లోని సదరన్ యూవర్సిటీకి చెందిన నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది. స్టడీలో భాగంగా వారు చరిత్రలోని పలు పరిణామాలకు సంబంధించిన డేటాను, అలాగే ఆరోగ్యపరమైన అంశాలను ఎనలైజ్ చేశారు. ఆయా సందర్భాల్లో జండర్ పరమైన తేడాలను గుర్తించారు. ఆపత్కాలంలో ఎవరు ఎక్కువగా తట్టుకోగలరనేది అంచనా వేశారు. ఇందుకోసం 1845 నుంచి 1849 మధ్య సంభవించిన ఐరిష్ కరవు, అలాగే 1846 నుంచి 1882 మధ్య ఐస్‌లాండ్ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన అంటు వ్యాధులను,19వ శతాబ్దంలో అమెరికాలో ఆఫ్రికన్లు ఎదుర్కొన్న సామాజిక, ఆర్థిక వివక్షతలను కూడా పరిశోధకులు విశ్లేషించారు. ఆయా సందర్భాల్లో స్త్రీలు, పురుషులు ఇద్దరిలో కఠినమైన పరిస్థితులను ఎవరు ఎలా ఎదుర్కొన్నారనేది అంచనా వేశారు.
రీసెర్చర్స్ ప్రకారం.. ఐస్‌లాండ్‌లో సంభవించిన అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో మహిళలు శక్తివంతులుగా ఉన్నారు. పైగా ఆ సందర్భంలో వీరి యావరేజ్ ఆయుర్థాయం (జీవన మనుగడ) 18.82 ఏండ్లు కాగా, పురుషుల సగటు ఆయుర్థాయం 16.75 ఏండ్లకు పడిపోయింది. అంటే కఠిన పరిస్థితులను మహిళలే ఎక్కువ తట్టుకుంటారనేది ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇక శిశువుల విషయానికి వస్తే జన్మించగానే సంభవించే వివిధ అలెర్జీలు, ఇన్ఫెక్షన్ల సందర్భంలో మగ శిశువులతో పోల్చినప్పుడు ఆడ శిశువులే సమర్థంగా తట్టుకోగలరని కూడా పరిశోధకులు గుర్తించారు. హార్మోన్ల విడుదలలో తేడాలను కూడా గమనించినప్పుడు మహిళల్లో విడుదలయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ వారి హెల్త్‌పై పాజిటివ్ ఇంపాక్ట్ చూపుతున్నట్లు తేలింది. ఇక పురుషుల్లో అధికంగా రిలీజ్ అయ్యే టెస్టొస్టెరాన్ హార్మోన్ కూడా మేలు చేస్తున్నప్పటికీ నెగెటివ్ ఇంపాక్ట్ కూడా చూపుతుంది. దీనివల్ల ఆడవాళ్లతో పోల్చితే మగవాళ్లలో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్‌గా స్త్రీలతో పోల్చితే ఆయుష్షు కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలే బలవంతులని నిపుణులు పేర్కొంటున్నారు.