అంతరించిపోతున్న ఆఫ్రికన్ పెంగ్విన్‌లు.. క్రాష్ అవుతున్న సార్డినెస్ ఫిషెస్
హిందూ మహాసముద్రంలో చేపల వేట అధికమవడం, పర్యావరణ మార్పులవల్ల సార్డినెస్ అండ్ యాంకోవిష్ వంటి చేపల జనాభా క్రాష్ అవుతోందని, అలాగే పెంగ్విన్‌లు ఆహారం కోసం కష్టపడుతున్నాయని
దిశ, ఫీచర్స్ : హిందూ మహాసముద్రంలో చేపల వేట అధికమవడం, పర్యావరణ మార్పులవల్ల సార్డినెస్ అండ్ యాంకోవిష్ వంటి చేపల జనాభా క్రాష్ అవుతోందని, అలాగే పెంగ్విన్‌లు ఆహారం కోసం కష్టపడుతున్నాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2035 నాటికి ఈ పెంగ్విన్‌లు అంతరించిపోయే ప్రమాదం ఉందని ‘ది గార్డియన్ నివేదిక’ పేర్కొన్నది. ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్’ కూడా అంతరించిపోయే జాతుల లిస్టులో పెంగ్విన్‌లు కూడా ఉన్నాయని హెచ్చరించింది. వాటి మనుగడకోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఆఫ్రికన్ పెంగ్విన్‌లు ఆకట్టుకునే శారీరక గుర్తులు, విలక్షణమైన బ్రేయింగ్ కాల్(కూత)కు ప్రసిద్ధి చెందాయి. ఎక్కువగా హిందూ మహా సముద్రం, నమీబియా, దక్షిణాఫ్రికా తీరంలోని ద్వీపాలలో నివసిస్తుంటాయి. కాగా పర్యావరణ మార్పులు, సముద్రంలో అల్లకల్లోలం, తుఫానులు, వరదలు, కాలుష్యం వంటి పరిస్థితులవల్ల అవి ముప్పును ఎదుర్కొంటున్నాయి. తగినంత సంతానోత్పత్తి జంటలు లేక ఇబ్బంది పడుతున్నాయని, గత దశాబ్దకాలంగా ఆఫ్రికన్ పెంగ్విన్‌ల జనాభా గణనీయంగా తగ్గిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 20వ శతాబ్దం ప్రారంభంలో అనేక మిలియన్ల సంఖ్యలో పెంగ్విన్ సంతానోత్పత్తి జంటలు ఉండేవి. ప్రజెంట్ కేవలం 11,000 వేలకంటే తక్కువగా కనిపిస్తున్నాయని ఎన్విరాన్ మెంటల్ సైంటిస్టులు పేర్కొంటున్నారు. ముప్పు పొంచి ఉన్నప్పటికీ మనుగడ సాధ్యమయ్యే అవకాశం ఉందని ‘టూ ఓషన్స్ అక్వేరియం ఫౌండేషన్’కు చెందిన డాక్టర్ జూడీ మాన్ అంటున్నారు. మత్స్యపరిశ్రమ, దక్షిణాఫ్రికా ప్రభుత్వం, ఆయిల్ అండ్ షిప్పింగ్ కంపెనీలు, శాస్త్రవేత్తలు, పరిరక్షకులు, ఇంటర్నేషనల్ అలయన్స్, ప్రజలు కలిసి పనిచేస్తే, ఆఫ్రికన్ పెంగ్విన్ సంఖ్య తగ్గకుండా ఆపగలమని, వాటి మనుగడకు ఢోకా ఉండదని అభిప్రాయపడుతున్నాడు.
Read More: శుద్ధి చేసిన నీరు కూడా ప్రమాదకరమే.. గోథే యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి