Health tips: పండంటి ఆరోగ్యానికి.. పసందైన పండ్లను తినేయండి!

ప్రతి రోజూ తీసుకునే ఆహారంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Update: 2024-12-01 12:40 GMT

దిశ, ఫీచర్స్: ప్రతి రోజూ తీసుకునే ఆహారంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజువారి ఆహారంలో భాగంగా పండ్లను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల కలిగే లాభాలు బోలేడు ఉన్నాయి. దేనికదే ప్రత్యేకమైన రంగు, రుచిని కలిగి భిన్నమైన పోషకాలతో నిండి ఉంటాయి. వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తికి: నారింజ పండులోని విటమిన్- సి శరీరానికి మేలు చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మానికి నిగారింపు ఇస్తుంది. యాపిల్‌లోని యాంటీఆక్సీడెంట్లు ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తాయి. జామ ఇమ్యూనిటీ.. జీర్ణశక్తిని పెంచుతుంది.

ఎముకలు బలం: అరటి పండులోని ఖనిజాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. వ్యాయామం చేసే వారికి ఇది చక్కటి ఎంపిక. ప్రూనే ఎముకలు బలంగా ఉండడానికి తోడ్పతుంది. కాల్షియం, పొటాషియం, విటమిన్- కె వంటివి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పైనాపిల్, దానిమ్మ కీళ్లనొప్పులను అడ్డుకుంటాయి. కివి పండు ఎముకల మజ్జను పెంచడంలో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి: బ్లూ బెర్రీస్, నల్లద్రాక్ష రెండూ రుచితోపాటుగా రక్తనాళికలకు మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్‌ స్థాయిని అదుపు చేస్తాయి. శరీరానికి కావాల్సిన తేమను అందించడానికి పుచ్చకాయ మంచిది. ఇది గుండె వేగాన్ని నియంత్రిస్తుంది. బొప్పాయిలోని యాంటీఆక్సీడెంట్లు గుండెను అనారోగ్యాల నుంచి కాపాడుతుంది.

మెదడుకు: దానిమ్మలో ఎల్లాగిటానిన్స్ అనే యాంటీఆక్సిడెంట్స్ మెదడు కణాలను ప్రోత్సహిస్తాయి. రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనత సమస్యలు తగ్గిసాయి. అవకాడోలోని మోనోఅన్‌శాచురేటర్ కొవ్వు మెదడుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు

Read More...

World AIDS Day 2024: నేడే ప్రపంచ ఎయిడ్స్ డే.. హెచ్ఐవీపై ఉన్న అపోహల్లో నిజమేంటో తెలుసుకోండి!





Tags:    

Similar News