సమ్మర్ వచ్చిందని సోడా అధికంగా తాగుతున్నారా.. కిడ్నీలు డేంజర్‌లో పడ్డట్లే!

ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి మొదలుకాగానే ఎండ వేడి మొదలైంది.దీంతో చాలా మంది ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చల్లగా ఏదైనా తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు

Update: 2024-03-03 08:27 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి మొదలుకాగానే ఎండ వేడి మొదలైంది.దీంతో చాలా మంది ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చల్లగా ఏదైనా తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.ముఖ్యంగా సోడా ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కువగా సోడా తాగుతుంటారు. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు అస్సలే సోడా తాగకూడదు అంటున్నారు వైద్యులు. రోజూ ఒక సోడ డ్రింక్ తాగడం వలన అది కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందంట.రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ తాగే వ్యక్తులు, వాటిని ఎప్పుడూ తాగని వారి కంటే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి బారిన పడే అవకాశం 20 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

అయితే సోడా రోజులో రెండు లేదా మూడు సార్లు తాగడం వలన అధిక రక్తపోటు, రక్తహీనత, ఎముకల వ్యాధి, గుండె జబ్బులాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదంట. అందువలన ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి అతిగా సోడా తాగకూడదని, దాని ప్రత్యామ్నాయం తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.


Similar News