డబ్బు సంపాదించడం కోసం రాత్రంతా మేల్కొని ఆ పనులు చేస్తున్నారా..?.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన నిపుణులు

మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే నిద్ర కూడా చాలా అవసరం

Update: 2024-05-19 08:27 GMT

దిశ, ఫీచర్స్: మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే నిద్ర కూడా చాలా అవసరం. తగినంత నిద్ర లేని వ్యక్తులు డిప్రెషన్, ఆందోళన, ఊబకాయానికి గురవుతారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం, కొంతమంది డబ్బు నిద్రను కూడా త్యాగం చేస్తున్నారు. దీని వల్ల ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, నిద్రలేమికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మీరు ఎక్కువ డబ్బు కోసం నిద్రపోకుండా పనులు చేస్తున్నట్లయితే, మీరు వెంటనే ఈ అలవాటును మార్చుకోవాలి, లేకపోతే మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. తాజాగా చేసిన పరిశోధనల్లో నిపుణులు షాకింగ్ నిజాలు వెల్లడించారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

చాలా మందికి అసౌకర్యం వల్ల సరిగా నిద్ర పట్టదు. 36 శాతం మంది వ్యక్తులు తమ భాగస్వామి గురక కారణంగా నిద్రకు ఆటంకం కలుగుతుంది. అలాగే కిటికీలోంచి వచ్చే శబ్దం, వెలుతురు తరచుగా నిద్రకు భంగం కలిగిస్తుంది. చాలా మంది రాత్రి పూట ఆఫీసు వర్క్ చేసే వాళ్ళు టీ, కాఫీలకు బాగా తాగుతుంటారు. ఇది చాలా ప్రమాదకరమని అంటున్నారు. 38 శాతం మంది ప్రజలు రాత్రిపూట టీ, కాఫీలు తాగి నిద్రించడానికి ఇబ్బంది పడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది.

రాత్రి నిద్రలేమికి కారణాలు:

డబ్బు మీద ఆశ ఉండేవాళ్ళు, లేట్ నైట్స్ కూడా వర్క్ చేస్తూ నిద్రను స్కిప్ చేస్తుంటారు. అధిక కాంతి కళ్ళ మీద పడటం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే రాత్రి పూట మద్యం సేవించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనలో కొంతమంది పడుకునే ముందు వరకు ఫోనును అదే పనిగా చూస్తుంటారు. దీని వలన నిద్ర కూడా చెదిరిపోతుంది. నిద్ర పోయే గంట ముందు ఫోనును పక్కన పెట్టడం చాలా మంచిది. ఫోన్‌లో గేమ్స్ ఆడడం, చదవడం వంటి అలవాటు ఉన్నవారికి కూడా నిద్ర పట్టదు. DFS పరిశోధన ప్రకారం.. రాత్రిపూట 8 గంటలు నిద్ర అవసరమని చెబుతున్నారు. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది.  ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Similar News