టమోటాని చీప్ గా చూస్తున్నారా.. ఆ ప్రాణాంతక వ్యాధి తగ్గిస్తుందన్న విషయం తెలుసా?

టమోటాని చీప్ గా చూస్తున్నారా..

Update: 2024-06-10 05:18 GMT

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో, చాలా మంది రక్తపోటు సమస్యలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నిజానికి, సోడియం ఎక్కువగా తీసుకోవడం వలన అధిక రక్తపోటు సమస్యలను కలిగిస్తుంది. అలాంటి సమయంలో పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల హై బ్లడ్ ప్రెజర్ తో పోరాడవచ్చు. టమోటాల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, లైకోపీన్ కూడా గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను కలిగి ఉంటాయి.

మనం సాధారణంగా ప్రతీ కూరలో టమోటాలు వేస్తుంటాము. ఇది ఎరుపు, పసుపు రంగులను కలిగి ఉంటుంది. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. టమోటాలలో విటమిన్లు, పోషకాలు, విటమిన్ సి, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా టమోటాలు మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.

క్యాన్సర్‌ను నివారిస్తాయి

టమోటాలను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్‌తో పోరాడుగలుతాం. అంతే కాకుండా ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే లైకోపీన్, యాంటీ క్యాప్సినోజెనిక్ లక్షణాలు ఉన్నాయి.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

టమోటాలు ప్రయోజనకరమైన ఖనిజాలను కలిగి ఉంటాయి. ఫైబర్, కోలిన్, విటమిన్ సి, పొటాషియం వల్ల గుండెకు మంచిది. లైకోపీన్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ కు చెక్ పెడుతుంది. రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Similar News