మీ నోట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే క్యాన్సర్ బారిన పడినట్టే!

ఈ మధ్య వ్యాధులు ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తున్నాయో తెలియడం లేదు. మనం ఉపయోగించే నిత్యావసర వస్తువుల నుంచి కూడా రకరకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి.

Update: 2024-06-07 05:31 GMT

దిశ, సినిమా: ఈ మధ్య వ్యాధులు ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తున్నాయో తెలియడం లేదు. మనం ఉపయోగించే నిత్యావసర వస్తువుల నుంచి కూడా రకరకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. వాటిలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించే, భయపెట్టే రోగాలలో క్యాన్సర్ ఒకటి. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. బాడీలో ఏ చోట అయినా కూడా క్యాన్సర్ రావచ్చు. దేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతుంది. క్యాన్సర్‌లలో నోటి క్యాన్సర్ కూడా ఒకటి. నోట్లోని పెదవులు, నాలుక, చిగుళ్లు, బుగ్గల లోపల ఇలా ఎక్కడైనా రావచ్చు. ఇలా ఎక్కడ వచ్చినా నోటి క్యాన్సర్ అనే అంటారు. ఈ నోటి క్యాన్సర్ వచ్చిన స్టార్టింగ్‌లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీంతో ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ నోటి క్యాన్సర్ ఒక తీవ్రమైన క్యాన్సర్‌గా చెప్పొచ్చు.

లక్షణాలు:

స్టార్టింగ్‌లో కొన్ని లక్షణాల, సంకేతాల ద్వారా ఈ నోటి క్యాన్సర్‌ను ముందు స్టేజ్‌లోనే గుర్తించవచ్చు. ఇలా గుర్తించడం ద్వారా చికిత్స త్వరగా తీసుకుని.. ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఆ లక్షణాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

* నోటి పూత, పొక్కులు, గుల్లలు వంటివి రెండు వారాలకు మించి ఉంటే కనుక కచ్చితంగా అనుమాన పడాల్సిందే.

*అలాగే నాలుక కింద కానీ, పైన కానీ స్పర్శ లేకుండా ఉండడం. అలాగే అప్పుడప్పుడు నోట్లో సూదులతో గుచ్చినట్టు ఉండటం, ఎరుపు రంగులో మచ్చలు ఏర్పడటం కూడా క్యాన్సర్‌కి కారణమే.

* అంతే కాకుండా గొంతులో, నాలుక కింద, బుగ్గల లోపల కణుతులు ఏర్పడి తీవ్రమైన నొప్పులు వస్తాయి. ఈ లక్షణాలను కూడా నోటి క్యాన్సర్‌గా చెప్పొచ్చు.

* అదేవిధంగా నోటి క్యాన్సర్ వచ్చిన వారికి ఏది తినాలన్నా, తాగాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఎలాంటి క్యాన్సర్ వచ్చినా కూడా.. బరువు అనేది ఒక్కసారిగా తగ్గిపోతారు.

*అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పడిపోయి ఎక్కువగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాల వల్ల ముందుగా నోటి క్యాన్సర్‌ను గుర్తించవచ్చు.

ఇలా జాగ్రత్త పడండి..

నోటి క్యాన్సర్ వచ్చాక బాధ పడటం కంటే.. రాకుండా కూడా ముందు నుంచే జాగ్రత్తలు పడండి. నోటి క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం మద్యపానం, ధూమపానం. వీటిని త్వరలోనే మానక పోతే ప్రాణాంతకం అవుతుంది.

NOTE: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.


Similar News