చనిపోయిన వారి వద్దకు వెళ్లి వస్తే స్నానం ఎందుకు చేయాలో తెలుసా?

మనం మన చిన్నపన్పటి నుంచి చూస్తూ ఉంటాం. మన పెద్దవారు, లేదా మనం ఎప్పుడైనా మనకు తెలిసిన వారు చనిపోతే అక్కడికి వెళ్లి వస్తే, తప్పనిసరిగా స్నానం చేయాలంటారు. ముఖ్యంగా మన పెద్దవారు

Update: 2024-02-26 08:33 GMT

దిశ, ఫీచర్స్ : మనం మన చిన్నపన్పటి నుంచి చూస్తూ ఉంటాం. మన పెద్దవారు, లేదా మనం ఎప్పుడైనా మనకు తెలిసిన వారు చనిపోతే అక్కడికి వెళ్లి వస్తే, తప్పనిసరిగా స్నానం చేయాలంటారు. ముఖ్యంగా మన పెద్దవారు చనిపోయిన కాడికి వెళ్ళొస్తే స్నానం చేస్తే ఇంట్లోకి రానిస్తారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు చనిపోయిన వ్యక్తి వద్దకు వెళ్లి వస్తే ఎందుకు స్నానం చేయాలి? స్నానం చేయకుండా ఇంట్లోకి వస్తే మన పెద్దవారు ఎందుకు రానివ్వరు, కాగా, దీని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు ప్రజలు భయంకర రోగాలతో చనిపోయేవారంట. మనిషి చనిపోయినా తర్వాత కొన్ని, రకాల రోగ కారకాలు శరీరంలోనూ, దేహం చుట్టూరా ఉంటాయి. దీని వల్ల మృతదేహాలను చూసేందుకు వచ్చేవారికి ఈ వైరస్‌లు వ్యాపించే అవకాశం ఉంది. అయితే స్నానం చేసి వస్తే ఆ హానికర వైరస్‌లు శరీరంలో నుంచి తొలిగిపోతాయని పెద్దలు సూచించారు. అందువలన అప్పటి నుంచి ఇప్పటి వరకు శవం వద్దకు వెళ్లి వస్తే తప్పనిసరిగా స్నానం చేయాలి అంటారు.


Similar News