కూల్ డ్రింక్స్‌ బాటిల్లో డ్రింక్ ఎందుకు నిండుగా ఉండదో తెలుసా?

ఎండలో దాహాన్ని తీర్చుకోవడానికి మంచినీళ్ల కంటే కూల్ డ్రింక్స్ మనకి బాగా పని చేస్తాయి.

Update: 2023-06-14 06:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఎండలో దాహాన్ని తీర్చుకోవడానికి మంచినీళ్ల కంటే కూల్ డ్రింక్స్ మనకి బాగా పని చేస్తాయి. అందుకే వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ బాగా తాగేస్తుంటారు.అయితే వీటిని వేసవి కాలంలోనే కాకుండా అన్ని సీజన్లలో తీసుకుంటారు. ముఖ్యంగా ఫంక్షన్లలో, పార్టీలలో కూల్ డ్రింక్స్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి.

ఏ కూల్ డ్రింక్ చూసుకున్నా.. దానిలో డ్రింక్ బాటిల్ మూత వరకు నిండి ఉండదు. దానికి కారణం ఏంటి అంటే ఈ కార్బోరేటెడ్ వాటర్‌ను కార్బన్ డయాక్సైడ్ గ్యాస్‌తో మిక్స్ చేయడమే. ఆ గ్యాస్ అనేది బాటిల్‌లో పట్టడానికి ఫ్లేవర్డ్ డ్రింక్‌ను కాస్త తగ్గించి బాటిల్‌లో పోస్తారు.అలా కాకుండా కార్బన్ డయాక్సైడ్ గ్యాస్‌ కోసం ఎలాంటి ఖాళీ ఇవ్వకపోతే ఆ బాటిల్ పగిలిపోయే ప్రమాదం ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలోనూ ఖాళీ లేకుంటే బాటిల్ పగిలిపోతుంది. అందుకే కొంచం గ్యాప్ ఇచ్చి డ్రింక్స్ నింపుతారు.  

Read more:

కూల్ డ్రింక్ డ్రగ్స్, ధూమపానం, ఆల్కాహాల్‌తో సమానం.. అది తాగిన గంట లోపల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

రీల్స్ బాగా చూస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు

Tags:    

Similar News