సబ్బులు కలర్స్‌లో ఉన్నా నురగ తెల్లగా ఎందుకు వస్తుందో తెలుసా?

సోప్.. ఇది లేకుండా ఏ ఇళ్లు ఉండదు. ప్రతి ఒక్కరు సోప్స్ వాడుతుంటారు. అయితే మనం వాడే సబ్బులు, షాంపుస్ అనేవి రంగు రంగుల్లో వస్తుంటాయి. ఇక షాంపుస్, డిటర్జెంట్ పౌండర్స్ , సోప్స్ ఇవన్నీ కలర్స్‌లో

Update: 2024-03-08 09:50 GMT

దిశ, ఫీచర్స్ : సోప్.. ఇది లేకుండా ఏ ఇళ్లు ఉండదు. ప్రతి ఒక్కరు సోప్స్ వాడుతుంటారు. అయితే మనం వాడే సబ్బులు, షాంపుస్ అనేవి రంగు రంగుల్లో వస్తుంటాయి. ఇక షాంపుస్, డిటర్జెంట్ పౌండర్స్ , సోప్స్ ఇవన్నీ కలర్స్‌లో ఉంటాయి. కానీ వీటి నుంచి వచ్చే నురగ మాత్రం తెలుపు రంగులోనే ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు సబ్బుల రంగులు వేరైనా నురగ మాత్రం ఒకే రంగులో ఎందుకు ఉంటుంది. దీనికి గల అసలు కారణం ఏమిటని? కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

నీటిలో సబ్బును కరిగించినప్పుడు ఏర్పడే పొర చాలా సన్నగా ఉంటుందంట. కాంతి అనేది ఈ సబ్బు ద్రావణంలోకి వెళ్లినప్పుడు అది అనేక చిన్న చిన్న బుడగలుగా ఏర్పడుతుందంట. అంతే కాకుండా వివిధ దిశలలో కాంతిని వెదజల్లుతూ..బుడగలు ఏర్పడుతాయి.కాంతి అనేది తెలుపు రంగులో ఉంటుంది. దీని కారణంగా నురగ ఏర్పడుతుంది, ఆ నురగ కూడా తెల్లని రంగులో ఉంటుంది. అయితే సబ్బు , షాంపూలకు రంగులు వేయడానికి ఉపయోగించే రంగులు చాలా పలచగా ఉంటాయి. అంటే చాలా తక్కువ మోతాదులో రంగును ఉపయోగిస్తారు అందువల్లనే రంగులు ఎలా ఉన్నా నురగ మాత్రం తెల్లగా వస్తుందంట.


Similar News