సంక్రాంతిని జనవరిలోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

హిందువులు జరుపుకునే పండుగల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగ సంక్రాంతి.

Update: 2024-01-13 05:50 GMT

దిశ వెబ్ డెస్క్: హిందువులు జరుపుకునే పండుగల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగ సంక్రాంతి. బోగి పండుగతో మొదలై కనుమ పండుగతో ముగుస్తుంది. మూడు రోజుల పాటు సాగే ఈ పండుగ వెనుక అద్భుతమైన ఆరోగ్యప్రయోజాలు దాగి ఉన్నాయి. సాధారణంగా సంక్రాంతి పండుగ జనవరి నెలలో వస్తుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతిని జనవరిలో జరుపుకోవడం వెనుక సైన్స్ దాగి ఉంది. జనవరి నెలతో శీతాకాలం మొదలవుతుంది. చలి విపరీతంగా పెరుగుతుంది. ఇందువల్ల మనుషులతో పాటుగా అన్ని జీవరాసులలో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే సంక్రాంతి పండుగ నెల ప్రారంభం అయిన వెంటనే బెల్లంతో కూడిన పిడి వంటలు చేస్తారు.

బెల్లంలో ఐరన్, అలానే స్థూల, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధకతను పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇక భోగి పండుగ రోజు వేసే భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు వాడతారు. దీని వల్ల గాలిలో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఇక సంక్రాంతి ముగ్గుల్లో వేసే పసుపు కుంకుమ, అలానే ఆవు పేడతో పెట్టె గొబ్బెమ్మల కారణంగా ఇంట్లోకి సూక్ష్మ క్రిములు ప్రవేశించవు. ఇక కనుమ రోజు పశువులను పూచించడం ఆనవాయితీగా వస్తుంది. వ్యవసాయ ఆధారిత దేశమైన మనదేశంలో ఎప్పటినుండో పశువులు రైతులకు సహాయపడుతున్నాయి. అలాంటి పశువులకు ప్రాధాన్యతనిస్తూ.. వాటిని రక్షించడం మన బాధ్యత అని తెలియచేస్తుంది కనుమ పండుగ.

ఇక కనుమ రోజు పశువులకు పసుపు కుంకుమ, సున్నం ఉపయోగించి రంగులు వేస్తారు. ఇలా చేయడం వల్ల అవి చలికాలం లో వచ్చే వ్యాధుల భారిన పడకుండా ఉంటాయి. ఈరోజు పెరిగిన సాంకేతికతతో మనం తెలుసుకుంటున్న విషయాలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎలాంటి పరికరాలు లేనప్పుడే మన పూర్వికులు కనుగొన్నారు. అయితే అవి అందరు ఆచరించాలి అనే ఉద్దేశంతో  వాటిని సాంప్రదాయాల పేరుతో ప్రజల్లోకి తీసుకువచ్చారు. కానీ నేడు మనలో చాలామంది విదేశీ సంస్కృతి మోజులో పడి వాటిని మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నారు. ఇకనైనా మన సంసృతి మూలాల గురించి తెలుసుకుందాం.. విదేశ సంస్కృతిని గౌరవిద్దాం.. మన సంసృతిని ప్రేమిద్దాం. అందరికి దిశ సంక్రాంతి శుభాకాంక్షలు.

Tags:    

Similar News