సమ్మక్క తల్లి కుంకుమ భరణి‌గా ఎందుకు మారిందో తెలుసా?

తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర మొదలైంది.రేండేళ్లకు ఒకసారి అడవి తల్లులైన సమ్మక్క, సారలమ్మ జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతుంది.

Update: 2024-02-02 07:08 GMT

దిశ, ఫీచర్స్ : తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర మొదలైంది.రేండేళ్లకు ఒకసారి అడవి తల్లులైన సమ్మక్క, సారలమ్మ జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతుంది.ఈ వనదేవతలను దర్శించుకోవడానికి ఆంధ్ర , ఛత్తీస్‌గడ్, ఒడిషా వంటి రాష్టాల నుంచి కోటి మందికిపైగా జనం వస్తుంటారు.

ఇక ఇక్కడ అమ్మవార్లకు ప్రత్యేకమైన రూపం ఉండదు. సమ్మక్క దేవత కుంకుమ బరడి రూపంలో ఉంటుంది. మరి ఆ తల్లి కుంకుమ బరడిగా ఎందుకు మారింది? దాని వెనకున్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కాకతీయరాజులు యుద్ధం ప్రకటించగా, ఆ యుద్ధంలో కాకతీయుల సైన్యంతో పోరాడుతూ.. సారలమ్మ, నాగమ్మ మరణించారు. ఇక యుద్ధంలో పరాభవాన్ని తట్టుకోలేక జంపన్న ఆత్మహత్య చేసుకున్నాడంట. ఈ క్రమంలో కాకతీయ సైన్యంపై వీరోచితంగా పోరాటం చేసిన అనంతరం సమ్మక్క సైతం చిలకలగుట్ట అనే ప్రాంతం వైపు వెళ్తూ మాయమైనదంట. దీంతో అక్కడి ప్రజలు, గిరిజనులు సమ్మక్క కోసం వెతుకుతుండగా, ఒక పుట్ట దగ్గర పసుపు,కుంకుమ భరిణె కనిపించిందని దానినే సమ్మక్కగా భావించి ఆనాటి నుంచి ప్రతి మాఘశుద్ధ పౌర్ణమికి సమ్మక్క, సారలమ్మల జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందంట.


Similar News