ఎడతెరిపిలేని వానలతో జాగ్రత్త.. వైరల్ ఇన్ఫెక్షన్లు తలెత్తవచ్చు

చల్లటి వాతావరణం, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలువురు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Update: 2023-09-05 06:26 GMT

దిశ, ఫీచర్స్: చల్లటి వాతావరణం, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలువురు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ప్రాబ్లమ్స్ తలెత్తడానికి ప్రధాన కారణం బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లేనని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కూల్ వెదర్ వల్ల కొన్ని వేలకొద్ది బ్యాక్టీరియాలు, వైరస్‌లు ఉద్భవిస్తాయని, ఇందులో 1 నుంచి 5 శాతం వరకు వ్యాధికారకాలుగా ఉంటాయని చెప్తున్నారు. అలాంటి వాటిలో బాసిల్లస్ సెరియస్, క్లోస్ట్రిడియం బోటులినమ్, ఎస్చెరిచియా కోలి, సాల్మోనెల్లా ఎస్‌పిపి అనే వివిధ రకాల ఫుడ్‌బోర్న్ పాథోజెనిక్ బ్యాక్టీరియాస్ ప్రధానంగా ఉంటాయి.

ప్రజెంట్ ఎవరైనా గొంతునొప్పి, స్టమక్ పెయిన్, వాంతింగ్స్, ఫుడ్ పాయిజనింగ్, దగ్గ, చలితో కూడిన జ్వరం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే గనుక ఇవే కారణం అయి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక వీటితోపాటు పలు రకాల వైరస్‌లు, పరాన్న జీవులు కూడా చల్లటి వాతావరణంలో కలిసిపోయి ఇన్ఫెక్షన్లను, అనారోగ్యాలను కలిగిస్తాయి. అందుకే సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు కురుస్తున్నందున నీటి కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి కాచి వడబోసిన నీటిని తాగడం, బయటకు వెళ్లి రాగానే వేడినీటితో స్నానం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read More:   ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల బాడీలోని ఏ పార్ట్స్ పాడవుతాయో తెలుసా?


Similar News