పందెంలో ఓడిన పుంజులను ఏం చేస్తారో తెలుసా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.

Update: 2024-01-14 04:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజుల పాటు ప్రజలు ఉత్సవంలా ఈ పండుగను జరుపుకోగా.. తెలంగాణలో మూడ్రోజుల పాటు నిర్వహిస్తారు. ముఖ్యంగా సంక్రాంతి అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు.. గోదావరి జిల్లాలు. ఈ ప్రాంతంలో సంక్రాంతి పండుగను ప్రపంచంలో ఎక్కడా జరుగనంతగా గ్రాండ్‌గా జరుపుకుంటారు. నెల రోజుల ముందు నుంచే పల్లెల్లో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. ఇంటి ముందు ముత్యాల ముగ్గులు, ముగ్గుల్లో గొబ్బెమ్మలు.. హరిదారు కీర్తనలు, గంగి రెద్దు ఆటలు.. కొత్త అల్లుళ్ళు, కోడి పందాలతో సంక్రాంతి సంబరాలతో పల్లెలు కళకళలాడుతాయి.

అయితే, ఈ కోడి పందాలను కొందరు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. కన్న కొడుకును మేపినట్లు నెలల కొద్ది కోళ్లకు పౌష్టికాహారం ఇచ్చి పందాలకు సిద్ధం చేస్తుంటారు. ఒకవేళ పందెంలో ఓడిపోతే పరువు పోయిందని ఫీలవుతుంటారు. ఈ క్రమంలో పందెంలో ఓడిపోయిన కోళ్లను ఏం చేస్తారో అందరికీ తెలిసి ఉండదు. సంక్రాంతి వేళ ఈ వార్త వైరల్‌గా మారింది. అయితే, పందెంలో ఓడిపోయిన కోడిని చంపి కూర వండుకొని తినకుండా.. మరింత స్ట్రాంగ్‌గా రెడీ చేస్తారట. జీడిపప్పు, బాదం పిస్తా వంటి ఆహారంగా ఇచ్చి, కాలువల్లో స్విమ్మింగ్ చేయించి మళ్లీ వేలంలో వేస్తారని సమాచారం. వేలంలో గెలిచిన కోళ్లతో పాటు ఓడిన కోళ్లకు కూడా అంతే గిరాకీ ఉంటుందట. ఈ కోళ్లను వేలంలో దక్కించుకోవడాన్ని కూడా గొప్పగా భావిస్తారని సమాచారం.


Similar News