మంగళసూత్రంలో పగడం ధరించడం వలన ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా?
మన హిందూ సంప్రదాయాల్లో మంగళ సూత్రానికి ప్రత్యేకత ఉంటుంది. మహిళలు దాన్ని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. భార్య భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తుగా దీన్ని ధరిస్తారు స్త్రీలు.అయితే అత్తవారింటికి గుర్తుగా ఒకటి,
దిశ, వెబ్‌డెస్క్ : మన హిందూ సంప్రదాయాల్లో మంగళ సూత్రానికి ప్రత్యేకత ఉంటుంది. మహిళలు దాన్ని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. భార్య భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తుగా దీన్ని ధరిస్తారు స్త్రీలు.అయితే అత్తవారింటికి గుర్తుగా ఒకటి, రెండోది పుట్టింటికి గుర్తుగా మంగళసూత్రలు ఉంటాయి. వీటిని మహిళలు సౌభాగ్యానికి ప్రతీకలైన పసుపు, కుంకుమలతో నిత్యం పూజిస్తారు. అయితే వీటి మధ్యల్లో ఎరుపు పూసలు, నల్లపూసలు, పగడాలు, ముత్యాలు వేసి అల్లించుకుంటారు.
కొంత మంది పగడాలు, ముత్యాలు యాడ్ చేసుకోరు. అయితే మంగళసూత్రాలకు ముత్యం, పగడం యాడ్ చేయడం చాలా మంచిదంట. కుజుడు, చంద్రుడికి ప్రతీకలైన ఈ రెండు రాళ్లు గ్రహదోషాలను తొలగించి వైవాహిక బంధాన్ని మరింత పటిష్టం చేస్తుందని విశ్వసిస్తారు. సాధారణంగా స్త్రీలకు కుజ గ్రహ ప్రభావం వలన అతికోపం, కలహాలు, మొండితనం, అనారోగ్యం, రుతుదోషాలు వస్తుంటాయి. పగడం, ముత్యం ధరించడం వల్ల వాటి నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు పండితులు.