ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహారాలేవో తెలుసా !
ఈ రోజుల్లో కనీస గృహ అవసరాల్లో భాగమై పోయింది ఫ్రిజ్.
దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో కనీస గృహ అవసరాల్లో భాగమై పోయింది ఫ్రిజ్. పేద, ధనిక తేడాలేకుండా ప్రతి ఒక్కరూ ఫ్రిజ్‌ను వాడుతున్నారు. కూరగాయలు, పాలు, పెరుగు, డ్రింక్స్, పచ్చళ్లు, స్వీట్లు వివిధ రకాల ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ఇందులో పెట్టడం సహజం. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు, పండ్లు ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం.
ఉల్లిపాయలు
వంటకోసం ఉల్లిపాయలు కట్ చేశాక కొన్నిసార్లు అవి మిగులుతుంటాయి. ఇలాంటప్పుడు మిగిలిన వాటిని మరుసటి రోజుకు వాడుకోవచ్చని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ ఇలా పెట్టకూడదట. ఎందుకంటే కట్ చేసిన ఉల్లిపాయలు ఫ్రిజ్‌లో ఉంటే.. వీటి వాసనవల్ల అందులోని ఇతర ఆహార పదార్థాలు పాడవుతాయి.
బంగాళదుంపలు
బంగాళ దుంపలు దాదాపు చాలామంది ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఫ్రిజ్‌లోని చల్లటి వెదర్ వల్ల బంగాళా దుంపల్లో చెక్కర శాతం పెరుగుతుంది. తర్వాత వీటిని వాడటంవల్ల కూరలో రుచికూడా మారుతుంది. కాబట్టి ఫ్రిజ్‌లో కాకుండా వంటగదిలో మరోచోట పెట్టడం మంచిది.
తేనె
ఎన్నేళ్లు అయినా చెడిపోని పదార్థం తేనె. ఫ్రిజ్‌లో పెట్టకపోయినా ఏమీ కాదు. కొందరు ఈ విషయం తెలీక చాలా రోజులు నిల్వ ఉండాలని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. దీనివల్ల తేనె రుచి మారుతుందని, పెట్టకపోవడం మంచిదని ఆహార నిపుణులు చెప్తున్నారు.
అరటి పండ్లు
అరటిపండ్లను ఫ్రిజ్‌లో పెట్టడంవల్ల వీటిలోని ఎంజైమ్స్ తగ్గిపోతాయి. ఈ కారణంగా త్వరగా పాడైపోతాయి. కాబట్టి ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
READ MORE
చంద్రుడిపై పుట్టగొడుగులతో ఇల్లు.. నిర్మించేందుకు శాస్త్రవేత్తల ప్రయత్నం