ఉదయం టీకి బదులుగా కలబంద జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కలబంద ఆరోగ్యాల గని అంటారు. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున కలబంద రసం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. కానీ చాలా మంది ఉదయం
దిశ, ఫీచర్స్ : కలబంద ఆరోగ్యాల గని అంటారు. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున కలబంద రసం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. కానీ చాలా మంది ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగుతుంటారు. కానీ వాటికి బదులుగా కలబంద రసం తాగడం శ్రేయస్కరం.
కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇది ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. రోజూ ఉదయం పరగడుపున అలోవెరా జ్యూస్ తాగడం వలన అది కొలెస్ట్రాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే దీని వలన చర్మం నిగ నిగ మెరవడమే కాకుండా,చురుకుదనం, జీర్ణశక్తిని పెంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటివి చేస్తుంది. అదే విధంగా కలబందలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుంది. అంతే కాకుండ సమ్మర్‌లో చాలా మంది డీ హైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు రోజూ ఉదయం అలోవెర జ్యూస్ తాగడం లేదా, జెల్ పీసెస్‌లో కాస్త చక్కెర వేసుకొని తినడం వలన శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. శరీరంలోని వేడిని తగ్గించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.