అత్యంత ఖరీదైన పెర్ఫ్యూమ్ ఏదో తెలుసా.. ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..
పెర్ఫ్యూమ్ అంటే ఇష్టం ఉండని వారి సంఖ్య చాలా తక్కువే. ఏ ఫంక్షన్ కి వెళ్లినా, పార్టీలకు వెళ్లినా చాలా మంది పెర్ఫ్యూమ్ కొట్టుకోకుండా బయటికి అడుగు కూడా పెట్టరు.
దిశ, ఫీచర్స్ : పెర్ఫ్యూమ్ అంటే ఇష్టం ఉండని వారి సంఖ్య చాలా తక్కువే. ఏ ఫంక్షన్ కి వెళ్లినా, పార్టీలకు వెళ్లినా చాలా మంది పెర్ఫ్యూమ్ కొట్టుకోకుండా బయటికి అడుగు కూడా పెట్టరు. లేత రంగులో ఉండి గుబాళించే సువాసనలతో మతి పోగొడతాయి కొన్ని పెర్ఫ్యూమ్ లు. అంతే కాదు ఎంత చిరాకులో ఉన్నా ప్రశాంతమైన మూడ్ ని క్రియేట్ చేస్తాయి. అయితే సువాసనలు వెదజల్లే ఫెర్ఫ్యూమ్స్ లో ఏది మంచిది.. ఎలాంటి వాటిని వాడాలి అన్న విషయాలు చాలా మందికి తెలియదు. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పెర్ఫ్యూమ్ తయారికి, వ్యాపారానికి పెట్టింది పేరు ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్. తక్కువ ధర నుంచి మెదలుకుని అత్యంత ఖరీదైన పెర్ఫ్యూమ్ లు కూడా కన్నౌజ్‌లో తయారవుతుంది. ఇక్కడ తయారైన పరిమళ ద్రవ్యాలు దేశవిదేశాలకు సరఫరా చేస్తారు. ఫిడేలు, మల్లె, గులాబీ, బంతి పువ్వుల వంటి అనేక రకాల పువ్వులతో పెర్ఫ్యూమ్ తయారు చేస్తారు. వివిధ నగరాల నుంచి పువ్వులను స్వీకరిస్తారు. కన్నౌజ్ ప్రాంతంలోని మట్టికి కూడా ఒక ప్రత్యేకత ఉందట. వర్షపు చినుకులు కన్నౌజ్ నేల పై పడినప్పుడు నేల మంచి సువాసన వస్తుందట. ఆ సువాసన నుంచి కూడా పెర్ఫ్యూమ్ తయారు చేస్తారని అక్కడి వారి చెబుతారు.
కన్నౌజ్ లో తయారు చేసే పెర్ఫ్యూమ్ లో అత్యంత ఖరీదైనది ఔద్ అత్తర్. దీని ధర రూ. 8 లక్షల నుంచి మొదలై రూ. 50 లక్షల వరకు పలుకుతుందంట. దీంతో పాటు మిట్టి, షమామా, చమేలీ, గులాబీ, గుల్ హెన్నా, జాస్మిన్, కస్తూరి, బెల్ల వంటి చాలా రకాల అత్తర్లు ఇక్కడ తయారు చేస్తారు. వీటి ధర విషయానికొస్తే కిలో రూ.15 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటాయి. పెర్ఫ్యూమ్ ఎప్పుడూ చిక్కగా ఉండి సువాసన తేలికగా ఉండాలి. అలాగే అత్తరును నాలుక పై కొంచెం అంటిస్తే అది కాస్త చేదుగా ఉంటుంది. ఈ లక్షణాలనతో పెర్ఫ్యూమ్ ఎంత క్వాలిటీతో ఉందో చెప్పవచ్చు. మంచి క్వాలిటీతో ఉన్న పరిమళ ద్రవ్యాలు వాడితే ఎంత సమయమైనా దాని సువాసన తగ్గదు.