దిశ, వెబ్‌డెస్క్: విటమిన్ సి పుష్కలంగా ఉండే జామకాయ ఎంతో రుచిగా ఉండడమే కాకుండా ఆనారోగ్యాన్ని దరి చేరనివ్వకుండా చేస్తుంది. వీటిని చాలా మంది ఎక్కువగా తింటూ ఉంటారు. ఎన్నో ఔషధ గుణాలతో కూడుకున్న జామకాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది. అవేంటో చూద్దాం..
* జామకాయలో నారింజ కంటే రెట్టింపు విటమిన్ సి ఉంటుంది.
* జామకాయ రక్తంలోని షూగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.
* శరీరంలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేసి మనల్ని ఎంతో హెల్తీగా ఉంచుతాయి.
* న్యూట్రిషన్, క్యాన్సర్ జర్నల్‌లో ప్రచురించిన ఒక జంతు అధ్యయనం ప్రకారం జామకాయ సారం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలదని కనుగొన్నారు.
* అలాగే హైపర్ టెన్షన్‌తో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
* జామపండు, అరటిపండులో దాదాపు ఓకే మొత్తంలో పొటాషియం కంటెంట్ ఉంటుంది.
* జామకాయ ప్రెగ్నెన్సీ మహిళలు తింటే చాలా మంచిది.
* జామకాయలో ఉంటే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి9 జన్మించే బిడ్డ నాడీ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతుంది.
* రోజుకు ఒక్క జామకాయ తినడం వల్ల తప్పకుండా శరీర బరువు తగ్గుతారు.
* దగ్గు, చలి, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులకు వ్యతిరేకంగా శరీరాన్ని రక్షిస్తాయి.
* జామకాయ మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది.
* ఇన్ని ప్రయోజనాలున్న జామకాయను తినండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకొండి.
Also Read..