దివ్య ఔషధంగా పుదీనా.. ఒకటా, రెండా.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
మానవులకు తెలిసిన అతి పురాతన మూలికల్లో పుదీనా ఒకటి.
దిశ, వెబ్ డెస్క్ : మానవులకు తెలిసిన అతి పురాతన మూలికల్లో పుదీనా ఒకటి. అందుకే మన పూర్వీకుల నుంచి ఇప్పటివరకు పుదీనాను అనేక ఆయుర్వేద మందుల తయారీలో వాడుతున్నారు. ప్రత్యేక వంటకాల్లో పుదీనా ఉండి తీరాల్సిందే. ఇక తేనీటి నుంచి మొదలు ఆల్కహాల్ వరకూ అనేక పానీయాల్లో దీనిని వినియోగిస్తారు. అంత ప్రాచుర్యం పొందిన పుదీనాలో అనేక లాభాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..
పుదీనాలో ఉండే మెంథాల్ శరీరంలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది. అంతేకాకుండా కండరాల నొప్పిని తగ్గించడంలో పుదీనా సహాయపడుతుంది. నుదుట మీద పుదీనా ఆకుల రసం రాయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పుదీనాతో తయారుచేసే నూనెలు, క్రీములు తల నొప్పిని నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.
పుదీనా కడుపుని చల్లబరుస్తుంది. స్టమక్ అప్సెట్ కి ఇది మంచి చిట్కా. సరిగ్గా అరగాక పోవడం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోం, కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వంటి వాటి నుండి రిలీఫ్‌ని ఇస్తుంది. జీర్ణాశయంలోని హానికారక పదార్ధాలని తొలగిస్తుంది. పుదీనాతో తయారుచేసిన ఆయిల్ సువాసనను పీల్చడం వల్ల మెదడులో సెరోటోనిన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది శరీరంలోని ఒత్తిడి, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది.
Read More : శృంగార సామర్ధ్యాన్ని పెంచే ఎండుద్రాక్ష.. ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా.