నెమలికి ప్రెగ్నెంట్ ఎలా అవుతుందో తెలుసా..? శృంగారం వల్ల కాదట!

నెమలి అంటే ఇష్టపడని వారుండరు. అది ఎప్పుడు తన పిచాన్ని విప్పి నాట్యం చేస్తుందా అని ఎదురు చూస్తుంటారు. నెమలి తన అందం, నాట్యంతో ప్రతీఒకరినీ ఆకట్టుకుంటుంది.

Update: 2023-03-28 10:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నెమలి అంటే ఇష్టపడని వారుండరు. అది ఎప్పుడు తన పిచాన్ని విప్పి నాట్యం చేస్తుందా అని ఎదురు చూస్తుంటారు. నెమలి తన అందం, నాట్యంతో ప్రతీఒకరినీ ఆకట్టుకుంటుంది. అయితే నెమలికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఏ పక్షి అయినా, జంతువులు అయినా మనుషులలానే సంభోగంలో పాల్గొనే పిల్లను కంటాయి.కానీ నెమలి అలా కాదట, నెమ‌లి అస‌లు సంభోగంలో పాల్గొన‌ద‌ని, నెమ‌లి ప‌ర‌వ‌శించిన‌ప్పుడు మ‌గ నెమ‌లి క‌న్నీటి బిందువుల‌ను ఆడ నెమ‌లి మింగడం వ‌ల్ల ఆడ నెమ‌లి పున‌రుత్ప‌త్తి చెందుతుంద‌ని చెబుతుంటారు. అయితే దీనిపై నిపుణులు అభిప్రాయం వేరే ఉంది. సృష్టిలో ప్రతి జీవి లైంగికంగా కలవడం వలనే సంతానాన్ని పొందుతుంది. అదే ప్రకతి ధర్మం.పురుష బీజ క‌ణాలు, స్త్రీ బీజ క‌ణాల క‌ల‌యిక ద్వారా మాత్ర‌మే పిండోత్ప‌త్తి జ‌రుగుతుంది. పురుష బీజ క‌ణాల‌ను నోటి ద్వారా తాగ‌డం వ‌ల్ల ఏ జీవిలో కూడా పిండోత్ప‌త్తి జ‌రిగిన‌ట్టు ఇప్పటి వరకూ ఆధారాలు లేవు మగ నెమలి కన్నీరు మింగడం వలన ఆడ నెమలి సతానం కలుగుతుంది అనే అపోహే అంటున్నారు.

మగ నెమలి జతకట్టడానికి సిద్ధంగా ఉన్న సమయంలో, ఒకరకమైన శబ్ధం చేస్తూ, నాట్యం చేస్తుందంట, అప్పుడు ఆడ నెమలి ఆకర్షణకు గురై దానితో జతకడుతుందంట. ఇలా ఆడనెమలికి సంతానం కలుగుతుంది అంటున్నారు.

ఇవి కూడా చదవండి: అయ్యో పాపం పిల్లి.. ఆ కిటికీలో ఎంత అల్లాడిపోయిందో..(వీడియో)

Tags:    

Similar News