పుచ్చకాయ తిని గింజలు పడేస్తున్నారా? వీటి లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. వాటర్ మెలన్ విరివిగా లభిస్తుంది.

Update: 2024-03-12 09:31 GMT

దిశ, ఫీచర్స్: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. వాటర్ మెలన్ విరివిగా లభిస్తుంది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు జనాలు ఎక్కువగా పుచ్చకాయ తింటుంటారు. వాటర్ మెలన్ దాహాన్ని తీర్చుతుందనే చాలా మందికి తెలుసు. కానీ దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు మెండుగా ఉండే పుచ్చకాయ తింటే.. ‘హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

పుచ్చకాయలో పొటాషియం మెండుగా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. డిటాక్స్‌ చేస్తుంది. కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుండె జబ్బులను కారణమయ్యే కొలెస్ట్రాల్, బీపీని తగ్గించడానికి పుచ్చకాయలోని లైకోపీన్ ఎంతగానో సహాయపడుతుంది’ అని నిపుణులు చెబుతుంటారు.

అయితే చాలా మంది పుచ్చకాయ తిని దానిలోని గింజలను పడేస్తారు. కానీ పుచ్చకాయ గింజలు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ గింజలలో మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, కాపర్, అమైనో అమ్లాలు, పొటాషియం, జింక్ లతో పాటు కేలరీలు తక్కువగా, ప్రోటీన్ లో ఎక్కువగా ఉంటాయి. దీంతో చర్మం వైశాల్యం పెరగకుండా గుండె హెల్తీగా ఉంచడంతో ఇవి తోడ్పడుతాయి.

అంతేకాకుండా డయాబెటిస్ ను కంట్రోల్ ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వాటర్ మెలన్ గింజల్లో అధిక ప్రోటీన్లు ఉంటాయి. ఇవి తినడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఫేస్ పై పింపుల్స్ రాకుండా, దద్దుర్లు తగ్గించడంతో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. చర్మం పొడిబారకుండా, వృద్ధాప్యాన్ని నిరోధిస్తాయి. వాటర్ మెలన్ గింజల్లో ఉండే పొటాషియం, కాపర్, మెగ్నీషియం.. బోన్స్ ను స్ట్రాంగ్ గా ఉంచడంతో ఎంతో సహాయపడతాయి. అలాగే జుట్టు వేగంగా పెరగడానికి, మూలాలను బలపరుస్తుంది.


Similar News