కాఫీ ఎక్కువగా తాగుతున్నారా...? అయితే, రిస్క్..!

కాఫీ అనేది కొంతమందికి ఒక ఎమోషన్. మార్నింగ్ కాఫీ తాగకుండా ఏ పని స్టాట్ చేయరు మరికొందరు.

Update: 2024-11-15 05:55 GMT

దిశ, ఫీచర్స్: కాఫీ అనేది కొంతమందికి ఒక ఎమోషన్. మార్నింగ్ కాఫీ తాగకుండా ఏ పని స్టాట్ చేయరు మరికొందరు. నిద్ర లేచిన తరువాత ఒక కప్పు, ఆఫీస్ బ్రేక్ టైమ్‌లో, ఈవినింగ్ టైమ్‌లో.. ఇలా రోజుకు మూడు లేదా నాలుగు సార్లు కాఫీ తాగుతుంటారు. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఒక కప్పు కాఫీ తాగితే రిలీఫ్‌గా ఉంటుంది. కాఫీలో ఉండే కెఫిన్ అలసట, తలనొప్పిని మాయం చేస్తుంది. ఇది కేంద్ర నాడీ వ్వవస్థను ప్రేరేపించి, చురుకుగా ఉండేలా చేస్తుంది. అయితే, కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. రోజులో అధికంగా కాఫీ తాగితే దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అతిగా కాఫీ తాగడం వల్ల వచ్చే సమస్యలు:

అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని అధ్యయనంలో అధికంగా కెఫిన్ వినియోగించడంతో అధిక రక్తపోటు వచ్చే చాన్స్ ఉందని తెలిపింది. రోజుకు మూడు లేదా నాలుగు కప్పులు కాఫీ తాగడం మంచిదని, అంతేకంటే ఎక్కువగా తాగడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

అధిక రక్తపోటు: మనలో చాలామంది పని ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఎక్కువగా కాఫీ తాగుతుంటారు. దీని వల్ల అధిక రక్తపోటు, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి. ఇందులో ఉండే కెఫిన్‌ను తక్కువగా తీసుకోవడం మంచిదే. కానీ, దీనిని అధికంగా తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థను మరింత ఉత్తేజపరుస్తుంది.

నిద్ర సమస్య: రోజూ కాఫీ అధికంగా తాగడం వల్ల నిద్రకు దూరమయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఎక్కువగా కాఫీ తాగడం వల్ల నిద్ర దూరమవుతుంది. ఇది అనవసరమైన సూక్ష్మపోషకాల పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాకుండా ఐరన్ లోపాన్ని మరింతగా పెంచుతుంది.

డీహైడ్రేషన్: అధికంగా కాఫీ తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దీని కారణంగా ఉప్పు, శరీరంలోని నీరు ఎక్కువగా బయటకు పోతుంది. దీని వల్ల బాడీలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌కు కారణం అవుతుంది. అంతేకాకుండా అలసట, తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది.

జీర్ణ సమస్య: ఉదయాన్నే కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య పెరుగుంది. ఇందులో ఉండే యాసిడ్ రిఫ్లక్స్ వంటివి జీర్ణ సమస్యలను ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా జీర్ణాశయంలోని ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని కారణంగా ఛాతిలో మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనం తినే ఆహారంలోని క్యాల్షియంను శరీరం గ్రహించుకునే ప్రక్రియను కెఫిన్ అడ్డుకుంటుంది.

గుండె సమస్య: రోజూ అధిక మొత్తంలో కాఫీ తాగడం వల్ల శరీరంలోని కెఫిన్ శాతం అధికంగా పెరుగుతుంది. దీని వల్ల గుండె దడ, హృదయ స్పందన రేటులో మార్పులు రావొచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి గుండె సమస్యలకు దారితీస్తుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. 

Tags:    

Similar News