రోజూ నిద్ర లేవగానే ఇలా చేస్తే అఖండ విజయం మీ సొంతం.. ఈ మూడు శక్తులు మీ వెంటే

కాలం మారింది. కాలంతో పాటు మనుషులు, సమయం కూడా మారింది.

Update: 2024-07-28 02:42 GMT

దిశ, ఫీచర్స్: కాలం మారింది. కాలంతో పాటు మనుషులు, సమయం కూడా మారింది. పూర్వం ప్రతి ఒక్కరూ తెల్లవారు జామున 4 గంటల సమయంలో నిద్ర లేచి.. చకచక పనులన్నీ పూర్తి చేసుకునేవారు. సూర్యుడు ఉదయించకముందే లేచేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాక లేస్తున్నారు. మరికొంతమందికైతే ఆ సూర్యుడ్ని చూసే అవకాశం ఉండట్లేదు. దీనికి కారణం రాత్రి తొందరగా పడుకోకపోవడం. ఫోన్ చూడడం, ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు వేయడం.

కాగా ఈ పద్ధతిని మార్చుకోకపోతే జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. పెద్దలు లేచి, పిల్లలకు కూడా మంచి అలవాట్లను అలవార్చాలంటున్నారు. అంతేకాకుండా రాత్రి తొందరగా పడుకుని మార్నింగ్ లేవడంతో పాటు నిత్యం అనుసరించాల్సిన పలు విషయాలు కూడా నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఉదయం కింద చెప్పిన విధంగా చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా సాఫీగా సాగిపోతుందట. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం వల్ల కలిగే లాభాలు

సూర్యుడు ఉదయించకముందు జ్యోతిష్య పండితులు చెప్పినట్లు బ్రహ్మముహుర్తం అంటారు. బ్రహ్మీ అంటే సరస్వతి దేవి. కాగా సూర్యోదయానికి ముందు నిద్ర లేస్తే మనలో బుద్ధి ప్రబోధం చెందుతుంది. మార్నింగ్ టైమ్‌లో వాతావరణంలో సానుకూల శక్తి ఉంటుంది. అంతేకాకుండా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఈ ముహూర్తంలో నిద్రలేచేవారికి సానుకూల ఆలోచనలు వస్తాయి.

మార్నింగ్ లేవగానే ఈ విధంగా చేయండి..

ఉదయం లేవగానే మీ అరచేతులను మీరు చూసుకుని, నమస్కరించుకోండి. అరచేతులను కళ్లకు అద్దుకుని లేవడం ద్వారా ఈ మూడు శక్తులు స్మరిస్తాయి. అరచేతి మధ్య భాగంలో శ్రీమహాలక్ష్మి ఉంటుంది. చేయి మధ్య భాగంలో సరస్వతి ఉంటుంది. మణికట్టు వద్ద గౌరీదేవి ఉంటుంది. కాగా కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే స్థితా గౌరీ, కర మూలే స్థితా గౌరీ అంటూ నిద్ర లేచాక ఈ శ్లోకం చదవండి. మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. అలాగే కాలు కింద పెట్టే ముందు భూమాతను నమస్కరించండి.భూదేవి నీపై కాలు పెడుతున్నాను క్షమించు అని అడగండి.

పెళ్లైన మహిళలైతే రోజూ నిద్ర లేచిన వెంటనే మంగళ సూత్రాలను కళ్లకు అద్దుకోవాలి. ప్రస్తుతం పలువురు మహిళలు మెడలో పుస్తెల తాడు వేసుకోవడం కూడా మర్చిపోతున్నారు. కానీ అలా చేయడం అరిష్టమంటున్నారు నిపుణులు. కాగా నిద్ర లేవగానే సుమంగళి ద్రవ్యాలు చూడాలి. రోజంగా మంచి జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ మార్నింగ్ తల్లిదండ్రులకు నమస్కరించండి. మన మొదటి గురువులు అండ్ ఈ ప్రపంచంలో వారికంటే ఎవ్వరూ గొప్పకాదు. కాగా రోజూ పేరెంట్స్‌కు నమస్కరించండి.

Tags:    

Similar News