టీ వేడి చేసి తాగుతున్నారా.. మీరు ప్రమాదంలో పడ్డట్టే

చాలా మంది తిండి తినకపోయినా టీ ఉంటే చాలు అనుకుంటారు.

Update: 2023-11-10 03:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది తిండి తినకపోయినా టీ ఉంటే చాలు అనుకుంటారు. టీ తాగితే ఉల్లాసం, ఉత్సాహం కలిగి చురుగ్గా ఉంటారు. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సుమారుగా ఒక పదిసార్లైనా టీ తాగేవారు ఉన్నారు. అలాంటి వారు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో టీ పెట్టుకుని తాగాలనిపించినప్పుడల్లా వేడిచేసుకుని టీ తాగేస్తుంటారు. టీ రుచి మారినా లొట్టలేసుకుంటూ ఆస్వాధిస్తారు. కానీ టీని అలా వేడిచేసుకుని తాగితే ఆరోగ్యానికి హానికరం అని వైద్యనిపుణులు చెబుతున్నారు. టీ తయారు చేసిన తరువాత నాలుగు గంటల తరువాత టీలో బ్యాక్టీరియా చేరడం మొదలైపోతుంది.

అలా బ్యాక్టీరియా తయారైన టీని వేడిచేసుకని తాగితే అనారోగ్యం పాలవుతారని నిపుణులు చెబుతున్నారు. బ్యాక్టీరియా తయారైన టీని వేడిచేసినప్పుడు దాని రుచి కూడా మారిపోయి చేదుగా ఉంటుంది. చాయ్ ని ఎక్కువ సార్లు వేడిచేస్తే అందులో ఉండే పోషకాలు అన్నీ పోతాయట. అలాంటి టీని తాగినప్పుడు వికారం, విరోచనాలు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టీని రోజుకు రెండు సార్లు మాత్రమే తాగాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎక్కువ సార్లు టీ తాగితే సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయట. టీని అప్పటికప్పుడు తయారు చేసి తాజాగా తాగితేనే ఆ ఫ్లేవర్ శరీరంలో చక్కగా పనిచేస్తుంది.

Tags:    

Similar News