పాములను భయపెట్టే చెట్లు ఉన్నాయని తెలుసా.. అవేంటంటే..?
సాధారణంగా పాములను చూస్తే చాలు.. భయపడి పారిపోతాం.
దిశ, ఫీచర్స్: సాధారణంగా పాములను చూస్తే చాలు.. భయపడి పారిపోతాం. అవి ఇళ్లలో కన్నా పొలాల్లో, అడవులలో ఎక్కువగా నివసిస్తాయి. ఇవి ఎలుకలను వేటాడే సమయంలో మనుషులకు కనిపిస్తుంటాయి.
కొంతమంది పాములు కన్పించగానే వెంటనే స్నేక్ సొసైటీవారికి సమాచారాన్ని ఇస్తారు. మరికొందరు అయితే పాములను చూడగానే నాగ దేవత అంటూ దండాలు పెట్టి పూజ చేస్తారు. పాములు కొన్నిసార్లు మనుషులను కాటేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో పాముకాటుకి గురవుతుంటారు. కొందరు తమ ఇళ్లలోకి పాములు రాకుండా ఇంటి దగ్గర చెట్లను నాటుతారు. వీటిని వాసనకి పాములు భయడతాయని చెబుతున్నారు.
ఈ భూమి మీద అనేక రకాల చెట్లు ఉన్నాయి. ప్రతీ చెట్టు ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుంది. అన్నింటి కంటే ముందుగా స్నేక్స్ ఈ వాసనను వెంటనే పసిగడతాయి. పాములకు ఇష్టం లేని చెట్లను మన ఇంట్లో నాటితే పాములు మన ఇళ్ల వైపు రాకుండా ఉంటాయి. సిట్రస్ పండ్లు, లెమన్‌గ్రాస్‌ను ఇంటి లోపల ఉంచాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, లవంగాలు వంటి మొక్కలను పొల్లాల్లో పెంచుకుంటే.. పాములు రావని నిపుణులు అంటున్నారు.