Betel Leaves: తమలపాకు తినడం వలన ఇన్ని ఉపయోగాలున్నాయని తెలుసా ..!

ఇది తీగ జాతికి చెందిన మొక్క

Update: 2025-03-23 09:15 GMT
Betel Leaves: తమలపాకు తినడం వలన ఇన్ని ఉపయోగాలున్నాయని తెలుసా ..!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తమలపాకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇది తీగ జాతికి చెందిన మొక్క. ఇది దక్షిణ ఆసియా ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. దీని ఆకులను పూజలు, శుభకార్యాలలో ఉపయోగిస్తారు.అలాగే, కొందరు నములుతారు కూడా.. తమలపాకులో వక్క, సున్నం కలిపి కిళ్లీ లాగా తయారు చేస్తారు. వీటిని షాప్స్ లో కూడా అమ్ముతారు. అయితే, వీటిని తినడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: తమలపాకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే, ఇది జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. మలబద్ధకం నుంచి బయటపడాలంటే .. తమలపాకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే పేగు ఆరోగ్యానికి చాలా మంచిది.

నోటి సమస్యలు : తమలపాకును రోజూ నమలడం వలన నోటి దుర్వాసనను తగ్గేలా చేస్తుంది. ఇది నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

శ్వాసకోశ సమస్యలు : ఊపిరితిత్తులు , ఛాతీలో ఇబ్బంది ఉన్న వారు.. తమలపాకులు తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

రోగనిరోధక శక్తి : తమలపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.

మధుమేహాన్ని నియంత్రిస్తుంది: షుగర్ పేషెంట్లు కూడా తమల పాకును తీసుకోవడం వలన డయాబెటీస్‌ను నియంత్రిస్తుంది.

గుండె జబ్బులు : తమలపాకు గుండె జబ్బులు ఉన్నవారికి ప్రమాదకరం.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News