WhatsApp - Meta AI: వాట్సాప్‌‌‌‌‌‌లో Meta AI వినియోగించి GIF ఇలా క్రియేట్ చేసుకోండి..

వాట్సాప్ లో Meta AI సంచలనం సృష్టిస్తుంది. గత నెలలో AI అసిస్టెంట్ సమాచారం అందించడం, ఇచ్చిన టాస్క్ పూర్తి చేయడం, జోక్స్ పేల్చడం ద్వారా జనాల్లో మంచి ఆదరణ పొందిన ఈ స్పెషల్ ఫీచర్.. ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణతో వచ్చేసింది. చాలా మంది చాట్ చేస్తున్నప్పుడు సరైన GIF

Update: 2024-08-05 15:27 GMT
WhatsApp - Meta AI: వాట్సాప్‌‌‌‌‌‌లో Meta AI వినియోగించి GIF  ఇలా క్రియేట్ చేసుకోండి..
  • whatsapp icon

దిశ, ఫీచర్స్: వాట్సాప్ లో Meta AI సంచలనం సృష్టిస్తుంది. గత నెలలో AI అసిస్టెంట్ సమాచారం అందించడం, ఇచ్చిన టాస్క్ పూర్తి చేయడం, జోక్స్ పేల్చడం ద్వారా జనాల్లో మంచి ఆదరణ పొందిన ఈ స్పెషల్ ఫీచర్.. ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణతో వచ్చేసింది. చాలా మంది చాట్ చేస్తున్నప్పుడు సరైన GIF కోసం సెర్చ్ చేస్తుంటారు. ఇకపై ఈ అవసరం లేకుండా సొంతంగా క్రియేట్ చేసుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. కాగా మీ క్రియేటివిటీ ఉపయోగించి Meta AIతో GIF ఎలా సృష్టించాలో తెలుసుకుందాం.

  • ముందుగా Play Store కు వెళ్లి వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ అప్డేట్ అయిందా లేదా తెలుసుకోండి. లేదంటే అప్ డేట్ చేయండి.
  • ఇప్పుడు వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి.
  • మీరు ఎవరికైతే GIF పంపించాలని అనుకుంటున్నారో ఆ చాట్ కు వెళ్లండి.
  • ఇప్పుడు + సైన్ ప్రెస్ చేయండి.
  • ఇమాజిన్ చూజ్ చేసుకోండి.
  • వాట్సాప్ Meta AI ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన GIF వివరణ టైప్ చేయండి.
  • డీటెయిల్స్ ఇచ్చాక ఎంటర్ నొక్కేయండి.
  • యానిమేట్ ప్రెస్ చేయడం ద్వారా GIF గా మార్చే అవకాశం వస్తుంది.
  • ప్రాసెస్ పూర్తయ్యాక ఈ యానిమేటెడ్ GIF సెండ్ చేసేందుకు ఎంటర్ నొక్కండి.
Tags:    

Similar News