మనుషులు శాశ్వతంగా జీవించడం సాధ్యమా?.. కుర్జ్‌విల్ థియరీ ఏం చెబుతోంది?
సైన్స్ పరిణామాలు, వాటిపై పలువురు చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ క్యూరియాసిటీని పెంచుతుంటాయి.
దిశ, ఫీచర్స్ : సైన్స్ పరిణామాలు, వాటిపై పలువురు చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ క్యూరియాసిటీని పెంచుతుంటాయి. ఇటీవల ఇస్రో చైర్మెన్ సోమనాథ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో మనిషి జీవిత కాలం 2000 సంవత్సరాల నుంచి 3000 సంవత్సరాలకు పెరగవచ్చునని కామెంట్ చేశారు. ఇప్పటికే జరుగుతున్న మెడికల్ రీసెర్చింగ్స్, భవిష్యత్ ఆవిష్కరణలవల్ల ఇది సాధ్యం కావచ్చు అని అభిప్రాయపడ్డారు. అయితే అచ్చం ఇలాంటి ఉత్సకతను పెంచే మరో విషయం ఏంటంటే.. రాబోయే కాలంలో మనిషి శాశ్వతంగా జీవించేందుకు దోహదం చేసే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని, సైన్స్ మరింత డెవలప్ అవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గతేడాది ప్రముఖ కంప్యూటర్ సైంటిస్ట్ కుర్జ్‌విల్ దీనిని ముందుగానే ఊహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
కుర్జ్‌విల్ థియరీ..
వాస్తవానికి కుర్జ్‌విల్ సామాజిక, ఖగోళ, సైంటిఫిక్ పరిణామాలను కచ్చితమైన అంచనాల వేయగల ట్రాక్ రికార్డ్‌గా, ఫ్యూచరిస్ట్‌గా ఫేసమ్ అయిన వ్యక్తి. ఇప్పటివరకు ప్రపంచానికి సంబంధించి ఆయన గెస్ చేసిన 140కి పైగా అంచనాలలో 85 శాతం నిజం అయ్యాయి. గతేడాది ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా 2005లో ‘The Singularity Is Near’ అనే పుస్తకంలో తాను పొందుపరిచిన థియరీని వెల్లడించారు. దీని ప్రకారం... 2030 నాటికి మనుషులు శాశ్వతంగా జీవించే అవకాశాన్ని సాధ్యం చేయడంలో టెక్నాలజీ కీ రోల్ పోషిస్తుంది.
జెనెటిక్స్.. నానో వీన్స్
‘జెనెటిక్స్, రోబోటిక్స్, నానోటెక్నాలజీ సెక్టార్‌లో ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ మరింత డెవలప్ అవడంవల్ల ఫ్యూచర్‌లో మానవులు నానోబోట్స్‌ను తమ నరాలుగా (veins) ఉపయోగించుకోవచ్చు’’ అని కుర్జ్‌విల్ (Kurzweil) పేర్కొన్నారు. నిజానికి నానోబోట్స్ 50-100 nm వెడల్పు కలిగిన స్మాల్ రోబోస్. ప్రజెంట్ DNA ప్రోబ్స్, సెల్ ఇమేజింగ్ మెటీరియల్స్, సెల్-స్పెసిఫిక్ డెలివరీ వెహికల్స్‌గా వీటిని యూజ్ చేస్తున్నారు. ఇయితే ఇవి మరింత డెవలప్ అవడం కారణంగా వృద్ధాప్యాన్ని, అనారోగ్యాన్ని అరికట్టడంలో హెల్ప్ అవుతాయని, సెల్యులార్ లెవల్స్‌లో హ్యూమన్ బాడీని రిపేర్ చేస్తాయని కుర్జ్‌విల్ థియరీ పేర్కొంటున్నది. దీనిని బట్టి భవిష్యత్తులో మానవులు ఎక్కువకాలం జీవించడంలో కణాల పునరుద్ధరణతోపాటు టెక్నాలజీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందనే అంచనాలు ఉన్నాయి.