వాతావరణ మార్పులు.. మానవ జీవితకాలాన్ని తగ్గిస్తాయా ?
వాతావరణ మార్పులు మానవ జీవితంపై భిన్నమైన ప్రభావాలు చూపుతాయనేది తెలిసిన విషయమే. అయితే కొన్ని ప్రతికూల మార్పులు జీవితకాలాన్ని ఆరునెలలకు తగ్గిస్తాయని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
దిశ, ఫీచర్స్ : వాతావరణ మార్పులు మానవ జీవితంపై భిన్నమైన ప్రభావాలు చూపుతాయనేది తెలిసిన విషయమే. అయితే కొన్ని ప్రతికూల మార్పులు జీవితకాలాన్ని ఆరునెలలకు తగ్గిస్తాయని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. అధ్యయనంలో భాగంగా బంగ్లాదేశ్‌లోని షాజలాల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూ స్కూల్ ఫర్ సోషల్ రీసెర్చ్‌కు చెందిన పరిశోధకులు బృందం 1940 నుంచి 2020 వరకు 191 దేశాలకు సంబంధించిన 80 సంవత్సరాల క్లైమేట్ చేంజ్ డేటాను పరిశీలించింది.
ఉష్ణోగ్రత, వర్షపాతంలో హెచ్చు తగ్గులు, కరువు కాటకాలు, గ్రీన్‌హౌస్ వాయువుల పెరుగుదల, ఇతర ప్రకృతి వైపరీత్యాలు మానవుల్లో సగటు ఆయుర్దాయం తగ్గుదలపై ఎఫెక్ట్ చూపుతున్నట్లు పరిశోధకులు నిర్ధారించారు. ఈ సందర్భంగా సగటు ఉష్ణోగ్రత, వర్షపాతం, తలసరి జీడీపీ వంటి వేరియబుల్స్‌తో పాటు దేశాల మధ్య అసమానతలను పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు. కేవలం 1° C (పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ టార్గెట్ లిమిట్ కంటే 0.5 ° C తక్కువ) వరకు ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా సగటు ఆయుర్దాయం సుమారు ఐదు నెలల ఆయు క్షీణతకు దారితీస్తున్నట్లు గుర్తించారు. ఇక వాతావరణ మార్పు సూచికలో 10- పాయింట్ల పెరుగుదలను పరిగణించినప్పుడు సగటు ఆయుర్దాయం ఆరు నెలల వరకు తగ్గుతోందని రీసెర్చర్స్ అంచనా వేశారు. కాబట్టి ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను, గ్రీన్ హౌస్ వాయువలను అరికట్టడానికి, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు ప్రపంచ దేశాలను కోరుతున్నారు.