Viral Video : ఓర్నీ.. ఇన్ని వంకర్లేంట్రా బాబూ..! ఈ రోడ్డెక్కితే గూస్ బంప్సే భయ్యా!!

Viral Video : ఓర్నీ.. ఇన్ని వంకర్లేంట్రా బాబూ..! ఈ రోడ్డెక్కితే గూస్ బంప్సే భయ్యా!!

Update: 2025-04-05 07:20 GMT
Viral Video : ఓర్నీ.. ఇన్ని వంకర్లేంట్రా బాబూ..! ఈ రోడ్డెక్కితే గూస్ బంప్సే భయ్యా!!
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : రోడ్డంటే ఎట్లుండాలె.. స్టార్టింగ్ దగ్గర బైక్ స్టార్ట్ చేస్తే.. రయ్యున దూసుకెళ్లి ఎండింగ్ దగ్గర ఆగాలె..! అనుకుంటామం మనం కొన్నిసార్లు. ఇక గతుకులు, వంకర్లు లేని రోడ్డుపై కారులో లాంగ్ జర్నీ చేస్తుంటే.. ఆ కిక్కే వేరబ్బా! అని కూడా అంటుంటారు కొందరు. అయితే ఎల్లప్పుడూ అనుకున్నట్లే ఉండదుగా.. ఒక్కో రోడ్డు ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతీ జర్నీ ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ (Different Experience) ఇస్తుందనడంలో సందేహం లేదు. అలాంటి ఓ వింతైన రోడ్డుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఎందుకలా? ఇంతకీ అదెక్కడుంది? దాని ప్రత్యేకతలేమిటో చూద్దాం!

అవును.. ఎవరు ఏ వాహనంతో ఆ రోడ్డెక్కినా సేమ్ ఎక్స్ పీరియన్స్ ఫేస్ చేయాల్సిందే! అంటే దానిపై నుంచి వెహికల్‌లో వెళ్తున్నా.. వెళ్లే వారిని చూసినా ఫస్ట్ టైమ్ చూసేవారికైతే భయంతో రోమాలు నిక్కపొడుస్తాయ్.. ఒక్కసారిగా ఒళ్లు జలదరిస్తుంది. ఇంతకీ అదెక్కడుందంటే.. వైరల్ సమారం ప్రకారం..ఈ వంకర టింకర భయంకర రోడ్డు చైనాలోని చాంగ్ క్వింగ్ ప్రాంతంలో గల ‘వుక్సీ కౌంటీ(Wuxi County)’లో ఉంది. ‘చాంగ్ క్వింగ్ జిగ్‌ జాగ్ రోడ్ (Chongqing Zig Zag Road)’ అని, ‘‘లిగ్‌పైషి జిగ్ జాగ్ మౌంటైన్ రోడ్ ’’ అని, ‘‘టోకెన్ స్టోన్ రోడ్’’ అని కూడా పిలుస్తుంటారు.

రెండు పర్వతాల మధ్య ఉన్న చాంగ్ క్వింగ్ జిగ్‌ జాగ్ రోడ్ రోడ్డు దాని భయంకరమైన వంకర్లు, మలుపుల కారణంగా ప్రపంచ ప్రజలను ఆకర్షిస్తోంది. దీనిపై వాహనాలను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడమంటే మామూలు విషయం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకొని వెళ్లాల్సిందే! కానీ.. స్థానికులు మాత్రం అంతగా భయపడరు. ఎందుకంటే ఈ రోడ్డుపై జర్నీ చేయడం వారికి అలవాటుగా మారింది. 

Tags:    

Similar News